Feb 16, 2023, 12:37 PM IST
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ బిజెపికి భారీ షాక్ తగిలింది. బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నివాసంలో అనుచరులతో సమావేశమైన కన్నా వారి ఎదుటే రాజీనామా ప్రకటన చేసారు. ఇక బిజెపిలో మనుగడ సాగించలేనని... అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాకు పంపనున్నట్లు కన్నా తెలిపారు.కొంతకాలంగా ఏపీ బిజెపి వైఖరిపై అసంతృప్తితో వున్న కన్నా రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ కార్యకర్తలతో అత్యవసరంగా సమావేశమైన కన్నా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపై రాజకీయ చర్చ మొదలైంది.