పృథ్వీ‌తో అర్ధరాత్రి తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పిన విష్ణుప్రియ, మాజీ ప్రియుడిని మళ్ళీ ప్రేమిస్తుందా..?

First Published | Nov 28, 2024, 12:25 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఫైనల్స్ కోసం టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతుంది. ఈరోజు హౌస్ లో పాత కంటెస్టెంట్లు మానస్, ప్రియాంక జైన్ వచ్చిసెకండ్ కంటెండర్ ను  సెలక్ట్ చేశారు. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతన్నాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక  అద్భుతమైన సంఘటన జరుగుతోంది. ఇక ఫస్ట్ ఫినాలే  కంటెండర్‌గా రోహిణి సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక నెక్ట్స్  టాస్క్ కు రెడీ అయ్యారు జనాలు. ఫస్ట్ డే  జరిగిన టాస్క్‌ని

అఖిల్ సార్థక్, హారికలు నిర్వహించారు. ఇక రెండోరోజు మరో కంటెండర్‌ షిప్ కాంపిటేషన్‌ని నిర్వహించడానికి మానస్, ప్రియాంక జైన్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఇక వారు సెలక్ట్ చసుకున్న ప్రకారం.. టికెట్ టు ఫినాలే రేస్‌ సెకండ్ కంటెండర్ ఎంపికలో భాగంగా.. మొదటగా సుడోకు గేమ్‌‌ని ఇచ్చారు.

ఇందులో కాంపిటేషనర్ కు నబిల్, ప్రేరణ రాగా.. వాళ్ళిద్దరు మాట్లాడుకుని.. మరో ఇద్దరి ప్లేస్ లలో  పృథ్వీ, అవినాష్‌లను తీసుకున్నారు. ఇక ఈ నలుగురు  తలపడ్డారు. అయితే నబీల్ ఆరాటం వల్ల ఆత్యాసకు పోయి.. సుడోకు నెంబర్ గేమ్‌ని కరెక్ట్‌గా పూర్తి చేయకుండానే వెళ్లి బెల్ మోగించాడు. 


దీంతో మానస్ వచ్చి.. ఏం చేశావ్ నాన్నా.. నాలుగు కరెక్ట్ పెట్టావ్.. నాలుగు తప్పు పెట్టావ్ అని గాలి తీసేశాడు. ఇక చివరకు ఎవరైతే ఆడలేరు అని నబిల్ సెలక్ట్ చేసుకున్నాడో.. ా అవినాష్ ఫస్ట్ రౌండ్ విన్నగ్ గా నిలిచారు. ఇక ఫస్ట్ రౌండ్ విన్ అయినందుకు అవినాశ్ కు 8 బాల్స్ రాగా.. ప్రేరణ, పృధ్వీకి 6 బాల్స్. నబిల్ కు నాలుగు బాల్స్ వచ్చాయి. ఇక ఆతరువాత జరిగిన బోర్డ్ క్రికెట్ లో అందరికంటే ఎక్కువ సిక్స్ లు కొట్టి.. అవినాశ్ మళ్ళీ విన్న్ గానలిలిచాడు. 

సో సెకండ్ కంటెండర్ గా అవినాశ్ ఎన్నికర్యారు. రోహిణి అవినాశ్ వరుసగా కంటెండర్ రేస్ గెలవడం అందరికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.  ఇక ఈ టాస్క్ లు ఆడించిన మానస్, ప్రియాంక. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎవరికి ఓపిక లేక అలా కామ్ గా ఉండిపోతారు.
 

ఈక్రమంలో  అంతా పడుకున్న తరువాత రాత్రి 2గంలకు పృధ్వీ బెడ్ మీదకు వెళ్తుంది విష్ణు ప్రియ. ఇక అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెపుతుంది. తన లవ్ స్టోరీని పృధ్వీ ముందు విప్పుతుంది ఈ నటి. మాట్లాడుతూ.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్.. లాస్ట్ కలలోవచ్చాడు అని చెప్పేస్తోంది.  అంటూ విష్ణుప్రియ చెప్పగానే ఏంటి ఆ కల.. చెప్పలేనంత కలా.. అని పృథ్వీ అడిగాడు. దీనికి నో ఎలా హర్ట్ అయ్యాడు.. 

అంటే ఇదంతా చూసి ఎంత బాధపడి ఉంటాడా అని వచ్చింది.. అంటూ విష్ణు చెప్పింది. ఎందుకు నువ్వేం చేశావ్ అలాంటిది.. అంటూ పృథ్వీ అడిగాడు. దీనికి అంటే ఆ బ్రేకప్ నుంచి నేను మూ అయిపోయా అన్నది విష్ణు ఇక తనకి నువ్వు ఇంకా కావాలా.. అతను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా.. అంటూ పృథ్వీ అడిగాడు.

దీనికి పాపం తెలీకుండా రెండు తప్పులు చేశాడు.. నా మంచి కోసం చేశాడు నాకు తెలిస్తే భరించలేనని .. కానీ నాకు తెలిసింది నిజంగా భరించలేకపోయాను.. నా దగ్గర కొన్ని విషయాలు దాచాడు.. ఎందుకంటే అవి నాకు నచ్చవని.. అది ఒకసారి చేశాడు.. మళ్లీ రెండోసారి చేశాడు.. నా ముఖం మీద చెప్పే గట్స్ అతనికి లేవు.. అలా గట్స్ లేని వ్యక్తితో ఉండాలని నాకు అనిపించలేదు అంటూ తన లవ్ స్టోరీని పృధ్వీ ముందు విప్పింది విష్ణు ప్రియ.  

Latest Videos

click me!