Galam Venkata Rao | Published: Feb 28, 2025, 8:00 PM IST
పార్లమెంటు నియోజకవర్గాల డీ లిమిటేషన్ (పునర్విభజన) కారణంగా దక్షిణాది రాష్ట్రాలకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గించాలని మోదీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అటు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం ద్రోహులకు మద్దతు పలికారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారని అంటూ వారిద్దరినీ KA పాల్ ఇమిటేట్ చేశారు.