Pahalgam Terror Attack: ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టం.. ప్రతికారం తీర్చుకుంటాం.. ప్రధాని మోదీ, అమిత్‌షా ఫైర్‌!

Published : Apr 22, 2025, 11:53 PM IST
Pahalgam Terror Attack: ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టం.. ప్రతికారం తీర్చుకుంటాం.. ప్రధాని మోదీ, అమిత్‌షా ఫైర్‌!

సారాంశం

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. దాడి తమను కలిచివేసిందని అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ ఉగ్రమూకల దాడి గురించి తెలిసిన వెంటనే  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే శ్రీనగర్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. దీంతో షా ఇప్పటికే శ్రీనగర్‌ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు.   

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. దాడి తమను కలిచివేసిందని అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ ఉగ్రమూకల దాడి గురించి తెలిసిన వెంటనే  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే శ్రీనగర్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. దీంతో షా ఇప్పటికే శ్రీనగర్‌ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. 

పహల్గామ్‌లో దాడులకు పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఇప్పటికే ప్రకటించింది. ఇది పక్కా ప్లానింగ్‌ ప్రకారమే జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. దాడి గురించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని షా అధికారులకు ఆదేశించారు. ఇక ఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రమూకలను ఎవర్రినీ వదిలిపెట్టమని వార్నింగ్‌ ఇచ్చారు. వారి ఎజెండా ఎప్పటికీ విజయం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం బలపడుతోందన్నారు. 

ఇక ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా కూడా స్పందించారు ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. ఎంతటి వారినైనా కఠింగా శిక్షిస్తామన్నారు. ప్రతికారం తీర్చుకుంటామన్నారు. ఇక పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఏం జరుగుతుందో కూడా అక్కడి వారికి అర్తం కాలేదు. తీవ్రవాదులు అందరూ ఆర్మీ దుస్తులు ధరించి ఉండటం... అత్యంత సమీపం నుంచి వారు కాల్పులు జరపడంతో అనేకమంది మృతి చెందారని అధికారిక వర్గాల సమాచారం. 

ఉగ్రదాడిలో తమ బంధు, మిత్రులను కోల్పోయినవారికి ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

eKYC: ఈకేవైసీ చేయించుకున్నారా... ఒక్కరోజే గడువు.. లేదంటే నష్టపోతారు! 
ind-pak: 107 మంది పాకిస్తానీయులు మిస్సింగ్‌.. ఇండియాకి వచ్చి ఎటు వెళ్లారో?