ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ పనితీరు నిరాశజనకంగా ఉంది. పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఎన్నో ఏళ్లుగా నానుతున్న తన వ్యక్తిగత విషయంపై స్పష్టతనిచ్చాడు ధోనీ.
ఎంఎస్ ధోనీ వీడియో: చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ 2025 సీజన్ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. మొదటి ఐదు మ్యాచ్‌లకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నారు. ఆయన గాయపడటంతో మహేంద్ర సింగ్ ధోనీ మళ్ళీ సారథ్యం చేపట్టారు. కెప్టెన్ మారినా జట్టు ఫలితాల్లో మార్పు రాలేదు. ధోనీ నాయకత్వంలో మూడు మ్యాచ్‌లు ఆడిన జట్టు ఒకదానిలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో ధోనీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తన గురించి ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న విషయంపై ధోనీ స్పందించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ధోనీ తన గురించి వస్తున్న ఓ విషయంపై స్పష్టత నిచ్చారు. ఈ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇంటర్వ్యూలో ధోనీని "మీ గురించి చెప్పబడిన అతి పెద్ద అబద్ధం ఏమిటి?" అని అడిగారు. దానికి ధోనీ "నేను రోజుకి 5 లీటర్ల పాలు తాగుతానని చెప్పుకుంటున్నారు, అది అస్సలు నిజం కాదు" అని సమాధానం ఇచ్చారు. "మీరు వాషింగ్ మెషిన్‌లో లస్సీ చేస్తారా?" అని అడిగిన ప్రశ్నకు "నాకు లస్సీ అంటే ఇష్టం లేదు" అన్నారు.
[Instagram embed code retained]
ధోనీ రోజుకి 5 లీటర్ల పాలు తాగుతారని, ఆయన ఆరోగ్య రహస్యం ఇదేనని అపోహ ఉండేది. ఈ అపోహపై స్పందించిన ధోనీ అదంతా అబద్ధమని, తాను అలా చేయనని స్పష్టం చేశారు. "ఒకరు రోజుకి అన్ని పాలు ఎలా తాగుతారు?" అని నవ్వుతూ అన్నారు.
ఐపీఎల్ 2025లో ధోనీ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంటోంది. ప్లేఆఫ్స్ చేరడం కష్టమే అనిపిస్తోంది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో 10వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు నాలుగు పాయింట్లు సాధించిన చెన్నైకి మిగిలిన ఆరు మ్యాచ్‌లలో గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అప్పుడు జట్టుకి 16 పాయింట్లు వస్తాయి. అయితే ఇది అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదు. అయితే ధోనీ గతంలో అసాధ్యం అనుకున్న ఎన్నింటినో సుసాధ్యం చేసి చూపించాడు. ఇప్పుడూ ఆ మ్యాజిక్ కోసమే ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.