Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. అమర్నాథ్‌యాత్రకు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అతి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అనేక మంది మృతి చెందారు. ఇప్పటికైతే మృతుల సంఖ్య లెక్కకు రాలేదు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో ఘటన వెలుగులోకి వస్తుండటంతో ఆ దృశ్యాలు చూసిన వారు అయ్యో ఎంత ఘోరం జరిగిందోనని బాధపడుతున్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. అమర్నాథ్‌యాత్రకు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అతి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అనేక మంది మృతి చెందారు. ఇప్పటికైతే మృతుల సంఖ్య లెక్కకు రాలేదు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో ఘటన వెలుగులోకి వస్తుండటంతో ఆ దృశ్యాలు చూసిన వారు అయ్యో ఎంత ఘోరం జరిగిందోనని బాధపడుతున్నారు.
ముస్లిం కాదని తెలిసిన తర్వాత..
ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులలో అక్కడికి రావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. ఇక ఒక్కక్కరినీ ముస్లిమా కాదా అని కాల్పులు జరపడంతో అందరూ పరుగులు తీశారు. ఈక్రమంలో ఎడాపెడా కాల్పులు జరిపారు ఉగ్రావాదులు. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం. పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా దాడులు జరిగాయి.
పక్కా ప్లానింగ్‌తోనే...
ఉగ్రవాదులు ఆర్మీదుస్తులతో ఉండటంతో.. పర్యాటకులను మభ్యపెట్టి.. అతి దగ్గరి నుంచి కాల్పలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ప్రకటించింది. ఇది పక్కా ప్లానింగ్ ప్రకారంమే జరిగిందని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సౌదీలో ఉన్న ప్రధాని మోదీ వెంటనే హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే షా శ్రీనగర్ చేరుకుని అధికారులతో అత్యవసర భేటీ అయ్యారు.
కళ్ల ముందే భర్తను కోల్పోయి..
పహల్గామ్‌లో ప్రాంతంలో ఉన్న పచ్చిక మైదానాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి చేరుకున్నారు. అందులో ఓ జంట.. భేల్‌పురి తింటుండగా.. ఒక్కసారిగా కాల్పులు జరిపారని చెబుతున్నారు. ఈ ఘటనలో తన భర్తని కాల్చారని, ఆయన అక్కడికక్కడే మృతి చెందారని ఓ మహిళ ఆవేదనతో చెబుతోంది. తన భార్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు కాల్చారని ఆమె తీవ్రంగా ఏడుస్తున్నారు. ముస్లిం కాని వారిని వారు టార్గెట్ చేశారని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.