Galam Venkata Rao | Published: Feb 20, 2025, 9:00 PM IST
రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు గుంటూరు మిర్చి యార్డులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పోలీసులు కనీసం భద్రత కల్పించలేదని మాజీ మంత్రి విడదల రజనీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు టీడీపీ కోసమే కాకుండా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పని చేయాలని హితవు పలికారు.