మరికొందరు అయితే పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు ఇస్తామని నమ్మించి వారిని లైంగికంగా లోబరుచుకోవడం, ఆర్థికంగా దోచుకునే సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనిపై టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉండొచ్చు. కాకపోతే అది చాలా తక్కువ శాతం మాత్రమే. అందరూ అలా ఉండరు కదా. 10 శాతం మంది మాత్రమే కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలని వేధించే వారు ఉంటారు.