iPhone 16
యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 16ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై మంచి డీల్ లభిస్తోంది. అత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లు, ఆపిల్ లేటెస్ట్ A18 చిప్‌సెట్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభించనుందంటే.
ఐఫోన్ 16, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం 6 శాతం డిస్కౌంట్‌తో రూ. 74,990కి లభిస్తోంది. దీంతో పాటు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2500 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు మీ పాత ఫోన్‌ను ఎక్సేంఛ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 49,950 డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా అన్ని ఆఫర్లతో ఈ ఫోన్‌ను సుమారు రూ. 27 వేలకే పొందొచ్చు.
iPhone 16
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్+12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ ఏ18 చిప్, 6 కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇక ఈ ఫోన్‌లో బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్లను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ 2556 x 1179 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఓ ఎల్‌ఈడీ స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. రెయిర్ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లతో అద్భుతమైన విజువల్స్‌ను ఈ స్క్రీన్ అందిస్తుంది. తక్కువ ధరలో ఐఫోన్ 16ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా చెప్పొచ్చు.