సుదర్శన్ పట్నాయక్‌కు ఇసుక శిల్పకళలో 'ది ఫ్రెడ్ డారింగ్టన్ అవార్డు' దక్కింది. వెయ్‌మౌత్‌లో 10 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఇసుకతో రూపొందించినందుకు ఈ అవార్డు వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఒడిశాకు చెందిన ఇసుక శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌కు "ది ఫ్రెడ్ డారింగ్టన్ అవార్డు" లభించింది. బ్రిటన్‌లోని వెయ్‌మౌత్ నగరంలో జరిగిన శాండ్ వరల్డ్ 2025 అనే అంతర్జాతీయ ఇసుక శిల్పకళా ఉత్సవంలో ఈ అవార్డును ఆయనకు అందజేశారు.
ఈ సంవత్సరం శాండ్ వరల్డ్ 2025 అంతర్జాతీయ సైకత శిల్ప కళా ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది అంతర్జాతీయ ఇసుక కళాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న సుదర్శన్ పట్నాయక్ ప్రపంచ శాంతి సందేశాన్ని తెలియజేసేలా 10 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఇసుకతో రూపొందించారు.
I am honored to be the first Indian artist to receive the ‘Fred Darrington' British Sand Master Award at Sand World 2025, a prestigious international sand art festival in Weymouth, UK. This recognition is a testament to my 10-foot sand sculpture of Lord Ganesha, symbolizing the… pic.twitter.com/bs196xXd2l
— Sudarsan Pattnaik (@sudarsansand)ప్రఖ్యాత బ్రిటిష్ ఇసుక శిల్ప కళాకారుడు ఫ్రెడ్ డారింగ్టన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ఆయన పేరు మీద కొత్త అవార్డును ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును భారతీయ ఇసుక శిల్ప కళాకారుడికి మొదటిసారిగా అందించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 65కు పైగా అంతర్జాతీయ ఇసుక శిల్పకళ ఛాంపియన్‌షిప్‌లు, ఉత్సవాల్లో పాల్గొన్నారు.
వెయ్‌మౌత్ నగర మేయర్ జాన్ ఓ'రెల్ సుదర్శన్ పట్నాయక్‌కు ఈ అవార్డును, పతకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శాండ్ వరల్డ్ డైరెక్టర్ మార్క్ ఆండర్సన్, సహ వ్యవస్థాపకుడు డేవిడ్ హిక్స్ కూడా పాల్గొన్నారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయ సాంస్కృతిక మంత్రి నౌరేమ్ జె. సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవార్డు గురించి సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ, "2025లో ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కళాకారుడిగా ఇది నాకు చాలా ముఖ్యం. ఈ అవార్డును నా అభిమానులకు, నన్ను ఎప్పుడూ ప్రోత్సహించిన వారందరికీ అంకితం చేస్తున్నాను." అని అన్నారు.