Meta Llama 4 మెటా Llama వచ్చేస్తోంది.. AI లో ఇక భీకర పోరే!!

ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ లతో మెటా ఇప్పటికే తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) చాట్ బోట్ ని సైతం రంగంలోకి దింపింది. మెటా లామా 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విడుదలవుతోంది. దాని ఫీచర్లు, అంచనాలు, AI పోటీ గురించి తెలుసుకోండి.

Meta Llama 4 AI launch in april: details and expectations in telugu
మెటా లోగో

ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. ఓపెన్ఏఐ (OpenAI) కంపెనీ చాట్‌జీపీటీ (ChatGPT)తో టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారితే.. దానికి పోటీ వచ్చిన డీప్ సీక్ టెక్ రంగంలో మరిన్ని ప్రకంపనలకు తెర లేపింది. ఆ పోటీలో నేనూ ఉన్నానంటూ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) రంగంలోకి దిగింది. కంపెనీ కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) లామా 4 (Llama 4) ఈ ఏప్రిల్ నెలాఖరులో రిలీజ్ కానుంది. ఇదివరకే రెండుసార్లు ఆలస్యమైనా, AI పోటీలో మెటా ముందుండాలని చూస్తోంది. ఓపెన్ఏఐ (OpenAI) కంపెనీ చాట్‌జీపీటీ (ChatGPT) టెక్నాలజీతో సంచలనం సృష్టించాక, పెద్ద టెక్ కంపెనీలన్నీ AI మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రేసులో మెటా కూడా ఉంది.

Meta Llama 4 AI launch in april: details and expectations in telugu
5.39లక్షల కోట్ల పెట్టుబడి

లామా 4 రిలీజ్ గురించి మొదట్లో కొన్ని భయాలు కూడా ఉండేవి. ఈ మోడల్ ఓపెన్ఏఐ మోడల్స్ కంటే తక్కువగా ఉందని మెటా అనుకుంది. లామా 4 అనుకున్నంత బాగా లెక్కలు, లాజిక్ పనులు చేయడం లేదని తెలుసుకుంది. అందుకే ఈ వాటిని సరిదిద్దేందుకు మరింత సమయం తీసుకుంది. అందుకే రిలీజ్ ఆలస్యమైంది. ప్రస్తుతం ఇది పోటీదారులకన్నా ఎంతో మెరుగ్గా ఉందని మెటా చెబుతోంది.  చైనా టెక్ కంపెనీ డీప్‌సీక్ (DeepSeek) తక్కువ ఖర్చుతో మంచి AI మోడల్‌ను తయారు చేసింది. దీనివల్ల బెస్ట్ AI మోడల్‌ను తయారు చేయడానికి చాలా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని అర్థమైంది. అందుకే లామా 4 డీప్‌సీక్ టెక్నాలజీని వాడుకోవచ్చు. కనీసం ఒక వెర్షన్‌లో అయినా మిక్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అనే మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ వాడొచ్చు. దీంతో మోడల్‌లోని వేర్వేరు భాగాలకు ట్రైనింగ్ ఇచ్చి, వాటిని స్పెషలిస్టులుగా తయారు చేస్తోంది.

మెటా ఈ సంవత్సరం తన AI కోసం దాదాపు $65 బిలియన్లు (సుమారు రూ. 5,39,000 కోట్లు) ఖర్చు చేయనుంది. లామా 4 మొదట మెటా ఏఐ (Meta AI) ద్వారా రిలీజ్ చేసి, తర్వాత ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌గా (Open-source software) రిలీజ్ చేస్తారని సమాచారం.


గత సంవత్సరం మెటా తన మునుపటి AI మోడల్ లామా 3 ని రిలీజ్ చేసింది. ఇది ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు, మంచి కంప్యూటర్ కోడ్‌లను రాయగలదు, కఠినమైన లెక్కల సమస్యలను పరిష్కరించగలదు.

చాలా కష్టాలు, అంచనాల మధ్య మెటా లామా 4 ఈ ఏప్రిల్‌లో AI రంగంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతుందని ఆశిద్దాం. ఈ కొత్త మోడల్ ఓపెన్ఏఐకి గట్టి పోటీ ఇస్తుందో లేదో చూద్దాం.

Latest Videos

vuukle one pixel image
click me!