Dec 2, 2019, 8:24 PM IST
విశాఖపట్నం: బాలలు తమలోని ప్రతిభా పాటవాలు, దేశ సంస్కృతిని ప్రదర్శించేందుకు విశాఖపట్నంలో మెగా అంతర్జాతీయ పిల్లల ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్నిరాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో గ్లోబల్ ఫ్యాషన్ గ్రూమింగ్ ఏజన్సీ ''డి లా వాలెంటీనా'' ఈనెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిర్వహిస్తోంది. యూరోపియన్ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బాలల ఉత్సవం '' లిటిల్ మోడల్ ఎర్త్ 2019'' ఈసారి విశాఖ నగరంలోని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 20 దేశాల నుండి 75 మందికి పైగా బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.