Aug 2, 2021, 5:16 PM IST
తాడేపల్లి: ప్రకాశం బ్యారేజీ ఎగువన సీతానగరం నుండి రాయపూడి వరకు కృష్ణా నది కుడి కరకట్ట విస్తరణ పనులను పెనుమాక గ్రామస్తులు అడ్డుకున్నారు. పెనుమాక పరిధిలో జేసిబిలతో భూమిని చదును చేసే పనులను నిలిపి వేయాలని రైతులు ఆందోళనకు దిగారు. తమను సంప్రదించకుండా భూముల్లోకి ప్రవేశించడం వల్లే అడ్డుకుంటున్నామని రైతులు తెలిపారు.
రైతుల ఆందోళనతో కరకట్ట విస్తరణ పనులను ఏపీ రైతు సంఘం ప్రతినిధులు పరిశీలించారు. విస్తరణలో భాగంగా రైతులు పొలాల్లోకి వెళ్లి ముళ్ళ పొదలు తొలగించే చర్యలను నిలిపివేయాలని వారు సూచించారు. విస్తరణ పనులకు భూమి అవసరమైతే రైతులతో చర్చించి చట్ట ప్రకారం వ్యవహరించాని రైతు సంఘం ప్రతినిధులు సూచించారు.