ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 14.03.2025 శుక్రవారానికి సంబంధించినవి.
ఉద్యోగులకు ప్రమోషన్స్ పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మీ విలువ మరింత పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. దీర్ఘకాలిక వివాదాల నుంచి కాస్త ఉపశమనం దక్కుతుంది. ఉద్యోగాల్లో విమర్శలు తప్పవు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా చికాకులు తప్పవు.
అప్పుల ఒత్తిడి వల్ల ప్రశాంతత ఉండదు. పనులు కష్టం మీద పూర్తవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ముఖ్యమైన విషయాల్లో స్థిరమైన ఆలోచన ఉండదు. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. పిల్లల చదువు విషయాలు ఆనందాన్నిస్తాయి. ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలం.
నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పనులు టైంకి పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.
వృత్తి, వ్యాపారాలు సాధారణం. మిత్రులతో స్వల్ప విభేదాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఏదైనా పలుమార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ. గృహ నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి.
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానం. కొందరి ప్రవర్తన వల్ల ప్రశాంతత ఉండదు. ఉద్యోగంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. అప్పు ఒత్తిడి పెరుగుతుంది.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం దక్కుతుంది. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కంటి సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగవు.
ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం దక్కుతుంది.
వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు పెరిగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామితో అకారణంగా గొడవలు వస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నిరుద్యోగులకు అనుకూలం. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు కొంటారు.