85 కోట్ల సెటిల్మెంట్ ? తల పట్టుకున్న మోహన్ లాల్?
Mohanlal: 'లూసిఫర్ 2' చిత్రం విడుదల సమస్యల్లో చిక్కుకుంది. లైకా ప్రొడక్షన్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Mohanlal: 'లూసిఫర్ 2' చిత్రం విడుదల సమస్యల్లో చిక్కుకుంది. లైకా ప్రొడక్షన్స్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Mohanlal: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లూసిఫర్ 2’. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్నారు. విజయవంతమైన ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రూపొందుతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుపుతూ.. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మోహన్‌లాల్.
‘‘ఒక నటుడిగా నా కెరీర్‌లో ఎంపురాన్ ఓ గొప్ప అధ్యాయం. విజయవంతంగా ఈ సీక్వెల్ చిత్రీకరణను ముగించాము. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాకు సహకరించిన ప్రేక్షకులకు, చిత్ర టీమ్ కి ధన్యవాదాలు. ‘లూసిఫర్ 2’ ఈ ఏడాది మార్చి 27న మీ ముందుకు రాబోతుంద’’ని అన్నారు (Lucifer 2 Release Date).
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఊహించని ట్విస్ట్ లు పడ్డాయని, రిలీజ్ సమస్యలు వచ్చాయని తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ వారు భారతీయుడు 2 చిత్రం డిజాస్టర్ అవ్వటంతో భారీగా దెబ్బతిన్నారు. దాంతో భారతీయుడు 3 విషయం కూడా తేలేలా లేదు. మరో ప్రక్క రీసెంట్ గా అజిత్ తో తీసిన పట్టుదల చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ హౌస్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది.
ఫైనాన్సియల్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇవన్ని వచ్చి ఇప్పుడు ‘లూసిఫర్ 2’రిలీజ్ పై పడుతున్నాయి. అప్పులు వాళ్లు ముందు తమ విషయం తేల్చి తర్వాత లూసిఫర్ రిలీజ్ చూసుకోమంటున్నారు. ఇప్పటికిప్పుడు అవేమి సెటిల్ అయ్యేలా లేవు.
దాంతో మోహన్ లాల్ కు చెందిన ఆశ్వీర్వాద్ ఫిల్మ్స్ వారు ముందుకు వచ్చి ..లైకా ప్రొడక్షన్ హౌస్ ని నిర్మాతగా తప్పుకుంటే తాము సొంత రిలీజ్ చేసుకుంటామని ప్రపోజల్ పెట్టారు.
అందుతున్న సమచారం మేరకు లైకా ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇందుకు ఒప్పుకుని, సెటిల్మెంట్ నిమిత్తం 85 కోట్లు చెల్లించమని కోరుతున్నారు. ఇప్పటికే నెగోషియేషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే చర్చలు ఓ కొలిక్కి వచ్చి సినిమా రిలీజ్ కు దారి క్లియర్ అవుతుందని చెప్తున్నారు.
అయితే 85 కోట్లు పెద్ద మొత్తం అని ఆశ్వీర్వాద్ ఫిల్మ్స్ వారు ఫీలవుతున్నారట. ఇప్పటికి ఇంకా ఈ గొడవల నేపధ్యంలో ఓటిటి రైట్స్ క్లియరెన్స్ రాలేదట.
ఇక ఈ చిత్రం సినాప్సిస్ విషయానికి వస్తే ప్రపంచాన్ని శాసించే ఓ మాఫియాకు అధినేత అయిన స్టీఫెన్.. రాజకీయ నాయకుడిగా మారడానికి కారణమేంటి? అనేది తెలుసుకోవాలంటే ‘లూసిఫర్2: ఎంపురాన్’ చూడాల్సిందే (Lucifer 2 Empuraan).