Court: ‘కోర్ట్’ ప్రీ రిలీజ్ బిజినెస్: ఓటిటి,శాటిలైట్ ఎన్ని కోట్లకు అమ్మారు?

Nani Court: ప్రియదర్శి నటించిన 'కోర్ట్' సినిమా విడుదలకు ముందే నాన్ థియేటర్ రైట్స్ ద్వారా పెట్టుబడి రాబట్టింది. ఓటిటి, మ్యూజిక్, శాటిలైట్ రైట్స్ ద్వారా భారీగా లాభాలు గడించింది.

priyadarshi Court most profitable project before release? in telugu jsp
priyadarshi Court most profitable project before release? in telugu


Nani Court:  చిన్న సినిమా అయినా పెద్ద బజ్ తెచ్చుకన్న చిత్రం ‘కోర్ట్’. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, హర్ష వర్ధన్, శివాజీ, రోహిణి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది . స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ట్యాగ్ లైన్. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా రామ్ జగదీశ్ దర్శకత్వంలో కోర్ట్ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా మార్చ్ 14న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.  అయితే ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఓటిటి ఎన్ని కోట్లకు ఎవరికి అమ్మారు వంటి విషయాలు చూద్దాం. 
 

priyadarshi Court most profitable project before release? in telugu jsp
priyadarshi Court most profitable project before release? in telugu


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  #Court సినిమా దాదాపు  పది  కోట్ల వ్యయంతో రూపొందింది. అయితే ఈ మొత్తం నాన్ థియేటర్ రైట్స్ తో రికవరీ అయ్యింది. ఓటిటి రైట్స్ నెట్ ప్లిక్స్ 7 కోట్లకు అమ్ముడయ్యాయి.

అలాగే మ్యూజిక్ రైట్స్ 30 లక్షలు, శాటిలైట్ రైట్స్ ఈటీవికి 2 కోట్లకు ఇచ్చారని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా లాభాల్లో ఉన్నట్లు. దాంతో నాని ఈ సినిమాతో జాక్ పాట్ కొట్టాడని, అదంతా నాని బ్రాండ్ వల్లే సాధ్యైందని అంటున్నారు. ఇక సినిమాకు వచ్చే థియేటర్ రెవిన్యూ అదనపు లాభం అని వేరే చెప్పక్కర్లేదు.


priyadarshi Court most profitable project before release? in telugu


 ‘కోర్ట్’ సినిమా పోక్సో చట్టం మీద అవగాహన కల్పిస్తూనే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకు కనువిప్పు లాంటి సినిమా అని చెప్తున్నారు. విభిన్న పాత్రలు చేసే ప్రియదర్శి లాయర్ పాత్రలో చాలా బాగా నటించాడు.

ఈ సినిమాలో శివాజీ పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. తనలోని ఓ కొత్త కోణం ఈ పాత్రతో చూపించాడు. ఈ సినిమా తర్వాత శివాజీకి విలన్ రోల్స్ ఆఫర్స్ కచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. 
 
 

Latest Videos

click me!