వాలంటీర్ల వేధింపులకు.. మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్య..

May 30, 2020, 1:14 PM IST

మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పరవాడ మండలంలోని కలపాకలో ఆత్మహత్యకు ముందు బంధువులకు ఆడియో మెసేజు పంపి చనిపోయాడు.అచ్యుతాపురం మండలం నునపర్తిలో ఇల్లు కట్టుకుంటుంటే వాలంటీర్లు వేధింపులకు గురి చేశారని, కక్ష సాధింపులు చేస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆడియో మెసేజ్ లో తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చిన సత్యనారాయణ మూర్తి కన్నీటి పర్యంతం అయ్యాడు.