Video news : దొంగ అయ్యప్పమాల వేసుకుని..డబ్బులు వసూలుచేసి...

Nov 30, 2019, 12:01 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరులో దొంగ అయ్యప్పస్వామి మాల ధరించిన ముగ్గురు వ్యక్తులని గ్రామస్తులు పట్టుకున్నారు. అయ్యప్పలమని చెబుతూ ఇంటింటికి వెళ్లి చందాలు వసూలు చేస్తున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. ద్విచక్రవాహనంలో సాదారణ దుస్తులు పెట్టుకుని మాల వేషధారణలో చందాలు వసూలు చేశాక, దుస్తులు మార్చుకుని చెక్కేస్తున్నారు. గత నాలుగేళ్ళ నుండి అనేక గ్రామాల్లో తిరిగి ఇలాగే డబ్బు వసూలు చేసినట్లు  స్థానికులు చెబుతున్నారు.