హీటెక్కిన బిజెపి పాలిటిక్స్... వీర్రాజుకు ఎస్సీ మోర్చా చీఫ్ దేవానంద్ మద్దతు

Feb 16, 2023, 3:48 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవగింతయినా మచ్చలేని గొప్ప నాయకుడని... ఆయనపై అబాండాలు మోపుతూ అప్రతిష్టపాలు చేయాలని చూడటం దారుణమని  రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ అన్నారు. కొన్ని నకిలీ దళిత సంఘాలు వీర్రాజుపై కావాలనే బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని... సమయం వచ్చినపుడు అన్నీ భయటపెడతామని అన్నారు. సంబంధం లేని భూ వివాదాల్లోకి సోము వీర్రాజును లాగి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని దేవానంద్ హెచ్చరించారు.