May 19, 2022, 5:17 PM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ మాత్రం ఇంగ్లీష్ మీడియం విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ లో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. వీరిలో కొందరు విద్యార్థులకు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ తో ఇంగ్లీష్ లో మాట్లాడే అవకాశం వచ్చింది. విద్యాశాఖమంత్రి బొత్సతో పాటు ఇతర అధికారుల మధ్యలో సీఎం ముందు కూర్చుని అమెరికాన్ యాక్సెంట్ లో విద్యార్థులు ఇంగ్లీష్ లో అదరగొట్టారు. విద్యార్థుల ఇంగ్లీష్ ప్రావిణ్యం చూసి సీఎం జగన్ ముచ్చటపడుతూ వారిని అభినందించారు.