తుళ్లూరు : గడ్డం గీకడమైనా..డప్పు కొట్టడమైనా..అన్నీ అక్కడే...

Feb 5, 2020, 3:48 PM IST

అమరావతి దీక్షల్లో భాగంగా ఈ రోజు తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద కులవృత్తి దారులు ప్రదర్శనలు నిర్వహించారు. నాగలిఎడ్లు,కుమ్మరి పనిముట్లు, దర్జీ కుట్టు మిషన్లు, డప్పులు, మంగలి పనిముట్లు, పంచర్ షాప్ పనిముట్లు, ఆటో, ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శన చేశారు. దీక్షా శిబిరంలోనే  రైతులు, కూలీలుకు షేవింగ్ చేస్తూ బార్బర్స్ నిరసన తెలిపారు.