Jul 3, 2020, 4:13 PM IST
కృష్ణా జిల్లా, మచిలీపట్నం బందరు ఉపఖజానా కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిపింది. పెన్షన్ల పంపిణిలో అవకతవకలు, కార్యాలయంలో రికార్డుల నిర్వహణపైన పిర్యాదులు అందటంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది వద్ద ఏసిబి అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న ఎసిబి అధికారులు.