తిరుమలను కరోనా వైరస్ కుదిపేస్తోంది. కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతూ తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సాధారణ రీతిలో జరగనున్నాయి.
తిరుపతి: తిరుమలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు శ్రీనివాస దీక్షితులు సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన కోరనా వ్యాధికి చికిత్స పొందుతున్నారు.
ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే, కరోనా విజృంభణ కారణంగా ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడిగా శ్రీనివాస దీక్షితులు 20 ఏళ్లకు పైగా పనిచేశారు. కరోనా బారిన పడి మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేని పరిస్థితి ఏర్పడింది.
undefined
ఇదిలావుంటే, శ్రీవారి ఆలంయలోని పెద్ద జియ్యంగారికి కరోనా వైరస్ సోకింది. ఇ్పపటి వరకు 170 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 18 మంది అర్చకులకు, 100 మంది సెక్యురిటీ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
20 మంది పోటు సిబ్బందికి, కల్యాణకట్టలోని ఇద్దరికి కోరనా వైరస్ సోకింది. తిరుమలలోని పరిస్థితిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు.
ఈ పరిస్థితిలో శ్రీవారి దర్శనాలను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమణదీక్షితులు దర్శనాల కొనసాగింపును తప్పు పట్టారు.