వైఎస్ రాజారెడ్డితో శివప్రసాద్‌కు సంబంధాలు: వైఎస్ఆర్ బంపర్ ఆఫర్

By narsimha lodeFirst Published Sep 22, 2019, 8:30 AM IST
Highlights

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను అజాత శత్రువుగా పిలుస్తారు.

తిరుపతి: కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్టును మాజీ ఎంపీ శివప్రసాద్ కు గతంలో ఆఫర్ చేసింది. వైఎస్ రాజారెడ్డితో కూడ శివప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కిందని చెబుతారు.

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ శనివారం నాడు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైఎస్ రాజారెడ్డితో ఉన్న పరిచయం కారణంగా ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1996లో తిరుపతి నుండి ఎంపీ టిక్కెట్టును ఆఫర్ చేశారు. అయితే ఆ సమయంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అడ్డుకొన్నారని చెబుతారు.

వైఎస్ కుటుంబంతో కూడ శివప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత  సీఎం వైఎస్ జగన్ వివాహం సందర్బంగా తిరుపతి నుండి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు శివప్రసాద్ కూడ వంద వాహనాల్లో  కడపకు వెళ్లారు. 

టీడీపీతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ నేతలతో కూడ చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అన్ని పార్టీల్లో కూడ శివప్రసాద్ ను అభిమానించే నేతలు ఉన్నారు. 

రాజకీయాల కంటే సినిమాలపైనే శివప్రసాద్ కు ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే తొలుత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిని కనబర్చలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
 

సంబంధిత వార్తలు

మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం కలచివేసింది : పవన్ కళ్యాణ్

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ నేపథ్యమిదీ

ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

ప్రత్యేక హోదా ఉద్యమం: శివప్రసాద్ వేసిన విచిత్ర వేషాలు ఇవే
వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!

click me!