ఇన్ స్టా లో యువతిగా పరిచయం.. నగ్న చిత్రాలను పంపమంటూ..అమ్మాయిలకు బెదిరింపులు.. యువకుడి అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Dec 24, 2021, 1:37 PM IST
Highlights

నగ్న చిత్రాలు పంపించకపోతే మార్ఫింగ్ చేస్తానని... కోరిక తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని  బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు 15 రోజుల క్రితం అజయ్ పై సైబర్ క్రైం పోలీసులకు నగరానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్ సుఖ్ నగర్ లో అజయ్ ని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : Instagram లో యువతులను మోసం చేస్తున్న అజయ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో యువతి Profile photoతో ఖాతా తెరిచిన అజయ్.. అమ్మాయిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడినట్టు తేలింది. యువకుడిని అమ్మాయిగా భావించిన యువతులు వారి ఫొటోలను పంపించారు. 

వారి Nude pictures పంపించకపోతే మార్ఫింగ్ చేస్తానని... కోరిక తీర్చకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని threatsకు పాల్పడ్డాడు. ఈ మేరకు 15 రోజుల క్రితం అజయ్ పై సైబర్ క్రైం పోలీసులకు నగరానికి చెందిన యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దిల్ సుఖ్ నగర్ లో అజయ్ ని అరెస్ట్ చేశారు. 

నిందితుడు అజయ్ వరంగల్ జిల్లా పరకాల వాసిగా పోలీసులు గుర్తించారు. అజయ్ హైదరాబాద్ లో మల్టీ మీడియా కోర్సు చేస్తున్నాడు. అజయ్ ఇప్పటివరకు చాలామంది యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 

హైద్రాబాద్‌లో మరో చైనా కంపెనీ మోసం: ముగ్గురు అరెస్ట్

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో ఓ వ్యక్తి వివాహితను లైంగిక వేధింపులకు గురి చేసి, దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఆమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఐదు నెలల బాబు ఉన్నాడు. ఓ కామాంధుడు తన కోరిక తీర్చాలంటే నెలరోజులుగా వెంటపడుతున్నాడు. తనకు అధికారం ఉందని... ఎవరూ ఏమీ చేయలేరు.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 

ఈ విషయం తెలిసిన కామాంధుడు ‘నా పైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ ఆమెతో పాటు ఆమె తల్లిపై కూడా విచక్షణారహితంగా attack చేశాడు. అయినా policeల నుంచి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

కనిగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన  married womanను అదే ప్రాంతంలోని తాళ్లూరుకు చెందిన సిహెచ్ ఏడుకొండలు కొంతకాలంగా sexual harassment చేస్తున్నాడు.  ఆమె భర్తకు ఫోన్ చేసి ఆమెను తన వద్దకు పంపాలంటూ బెదిరించాడు.  అతడి వేధింపులు తట్టుకోలేక గత నెల 28వ తేదీన ఆమె కనిగిరి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. 

అయినా చర్యలు లేకపోవడంతో.. ఈ నెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో మరోసారి వినతి అందించింది. అయినా చర్యలు లేకపోవడంతో ఈ నెల 17న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మరోసారి వినతి అందించింది. అక్కడినుంచి కనిగిరి చేరుకుని తల్లితో కలిసి ఆమె నడిచి వస్తుండగా స్థానిక పామూరు బస్టాండ్ సమీపంలో ఏడుకొండలు అడ్డుకున్నాడు.

‘నా పైన కేసు పెడతారా’ అంటూ రక్తం వచ్చేలా వారిద్దరినీ కొట్టాడు. ‘కుటుంబాన్ని ఊళ్ళో లేకుండా చేస్తా.. నీ భర్తను తరిమేస్తా’ అని తీవ్రంగా హెచ్చరించాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దాడి కేసు నమోదు చేసుకున్నారు. ఆయన ఏడుకొండలుపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో గురువారం కుటుంబసభ్యులంతా కనిగిరిలోని రజక సంఘం నాయకులను కలిసి తమ గోడు వినిపించారు.

ఈ విషయమై  ఎస్ ఐ జి రామిరెడ్డిని వివరణ కోరగా  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న ఏడుకొండలును వెంటనే అరెస్టు చేయకపోతే రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేస్తామని నాయకులు కోమటిగుండ్ల చెన్నయ్య, వెంకటేశ్వర్లు తెలిపారు. 

click me!