ఆన్ లైన్ క్లాస్ లో ఆగంతకుడు.. ‘ఆ అమ్మాయిని రేప్ చేస్తా..’అంటూ అసభ్యకర మెసేజ్ లు..చివరికి..

By AN TeluguFirst Published Sep 9, 2021, 4:58 PM IST
Highlights

ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆన్ లైన్ లోని ప్రవేశించాడు. ఓ విద్యార్థిని పేరును వ్యాఖ్యానిస్తూ.. ఆమెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతోపాటు ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు సైతం పంపాడు. దీంతో విస్తుపోయిన కాలేజీ యాజమాన్యం ఆ మరుసటి రోజు పాస్ వర్డ్ ను మార్చేసింది. 

కరోనా వైరస్ విజృంభణ అనంతరం విద్యారంగంలో పూర్తిగా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కాకుండా.. ఆన్ లైన్ పద్ధతిలో బోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ కళాశాల సైతం తమ విద్యార్థులకు జూమ్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండగా ఒక్కసారిగా ఓ అగంతకుడు ఆ క్లాసులోకి చొరబడ్డాడు.

అనంతరం ఓ విద్యార్థినిని రేప్ చేస్తానంటూ బెదిరించాడు. అంతే కాకుండా ఆ లెక్చరర్ వరస్ట్ అంటూ కామెంట్లు సైతం పెట్టాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుందో అర్థం కాక అటు విద్యార్థులు, లెక్చరర్లు ఒక్కసారిగా భయపడ్డారు. దీనిపై కళాశాల యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ పరిధిలోని నాచారం ప్రాంతంలోని ఓ కళాశాల.. తమ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈ మేరకు జూమ్ క్లాస్ లకు సంబంధించిన పాస్ వర్డ్ యాజమాన్యం విద్యార్థులకు వాట్సప్ ద్వారా షేర్ చేసింది.

ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆన్ లైన్ లోని ప్రవేశించాడు. ఓ విద్యార్థిని పేరును వ్యాఖ్యానిస్తూ.. ఆమెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతోపాటు ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు సైతం పంపాడు. దీంతో విస్తుపోయిన కాలేజీ యాజమాన్యం ఆ మరుసటి రోజు పాస్ వర్డ్ ను మార్చేసింది. 

అయినప్పటికీ.. ఆగంతకుడు ఆగలేదు. మళ్లీ వారి ఆన్ లైన్ క్లాసుల్లో చొరబడి అసభ్యంగా ప్రవర్తించాడు. కళాశాల లెక్చరర్ జీ మెయిల్ ను హ్యాక్ చేసి దాని ద్వారా పలువురికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఫలానా టీచర్ వరస్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు. దీంతో విసిగిపోయిన యాజమాన్యం.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఆగంతకుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. 
 

click me!