రేవంత్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన కాంగ్రెస్...

By Arun Kumar PFirst Published Nov 20, 2018, 9:47 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.  జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన సోనియా గాంధీ తెలంగాణ పర్యటన ఖరారయ్యింది. ఈ సందర్భంగా మేడ్చల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టిపిసిసి భావిస్తోంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి అప్పగించింది.  

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సోనియా గాంధీ తెలంగాణ పర్యటన చేపడుతున్నారు. అందువల్ల మేడ్చల్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజలతో పాటు సోనియాను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం వెలువడిన వెంటనే రేవంత్ కూడా ఏర్పాట్ల పర్యవేక్షణ పనుల్లో పడిపోయారు. 

మంగళవారం మేడ్చల్ లో పర్యటించిన రేవంత్ సభా స్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీకి  కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

 విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

click me!