విశ్వేశ్వర రెడ్డి రాజీినామా ఎఫెక్ట్: కెసీఆర్ కొడంగల్ వ్యూహాలకు దెబ్బ

By Nagaraju TFirst Published Nov 20, 2018, 7:16 PM IST
Highlights

ఒక తుఫాన్ సముద్రాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తుందో అలానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా  అల్లకల్లోలం చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగువెలిగిన ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉండటం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 

హైదరాబాద్: ఒక తుఫాన్ సముద్రాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తుందో అలానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా అనే అనే సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగువెలిగిన ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉండటం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఎంపీ రాజీనామాపై తొలుత హింట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. అయితే ఆ ఎంపీల రాజీనామాలతో అత్యధికంగా లాభపడేది రేవంత్ రెడ్డే. 

చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్యడం ఏంటి..కొడంగల్ నియోజకవర్గానికి కలిసొచ్చేది ఏంటని ఆలోచిస్తున్నారా...అక్కడే ఓ చిన్న లాజిక్ ఉంది..కాదు పెద్ద లాజిక్కే ఉంది. అది ఏంటో ఓ లుక్కేయండి. 

మెుదటి నుంచి అంటే టీడీపీలో ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని విమర్శించడంలో రేవంత్ రెడ్డికి మరెవ్వరూ పోటీరారనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు అసెంబ్లీలోనూ ఇటు బయటా కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చుతుంటారు.

ఈ నేపథ్యలో అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీపై గొంతు విప్పే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు సీఎం కేసీఆర్ చాలా చాకచక్యంగా వ్యూహ రచన చేశారు. అలా గొంతు నొక్కేవారిలో మెుదటి పేరు రేవంత్ రెడ్డిదేనని చెప్పుకోవాలి. అసెంబ్లీలోపలా, బయటా పార్టీని తనను ఇరుకున పెట్టుతుండటంతో ఆయన్ను అసెంబ్లీ మెట్టెక్కకుండా చేసేందుకు పావులు కదిపారు.

రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో కొడంగల్ లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ప్లాన్ వేశారు సీఎం కేసీఆర్. రేవంత్ ఓటమే లక్ష్యంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు కేబినేట్ మంత్రులను రంగంలోకి దింపారు. 

ఒకవేళ రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని వ్యూహరచన చేసింది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ కొట్టేందుకు ఆయన ముఖ్య అనుచరులను సైతం కారెక్కించేకున్నారు. 

అయితే ఎన్నికలు ఉన్నా లేకపోయినా రేవంత్ ఓటమే లక్ష్యంగా కేసీఆర్ ఆదేశాలతో పట్నం నరేందర్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, వరుస కేసులతో ఇబ్బందుల్లో రేవంత్ రెడ్డి ఉండటంతో ఆయన సోదరుడు ప్రచార బాధ్యతలను నిర్వహించారు. నరేందర్ రెడ్డికి పోటీగా అన్నతరపున ప్రచారం చేస్తున్నారు. 

తెరవెనుక ఉంటూ టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు టీఆర్ఎస్ వ్యూహాలను అన్నరేవంత్ రెడ్డికి వివరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలతో దూసుకుపోతున్నారు. ఇక ముందస్తు ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు.

రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో గులాబీ బాస్ కేసీఆర్ మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలకు కొడంగల్ బాధ్యలు అప్పగించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కొడంగల్ నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించడంతోపాటు రేవంత్ ఓటమికి కారణాలు వెతుకుతున్నారు.

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామాతో కేసీఆర్ కలలు పటాపంచెలయ్యాయి. రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి విశ్వేశ్వర్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యే అవకాశం ఉంది. మహేందర్ రెడ్డి ఆధిపత్య పోరు వల్లే విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

అదే పార్టీలో ఉండి పోరాటం చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అలాంటి భయాలు అక్కర్లేదు. ఇక నేరుగా మహేందర్ రెడ్డిని ఢీకొంటారు. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి తన సోదరుడి గెలుపుకంటే తన నియోజకవర్గం గెలుపే ముఖ్యం. 

ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించేకన్నా తన నియోజకవర్గంపై దృష్టి సారించాలి. లేనిపక్షంలో ఆయన గెలుపుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి తన దృష్టంతా తన నియోజకవర్గంపైనే పెట్టాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో కొడంగల్ ను వదిలేసినట్లే.

ఇకపోతే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమికి కేసీఆర్ విసిరిన మరో బాణం హరీష్ రావు. హరీష్ రావు ఇప్పటికే తలకు మించిన భారంతో పనిచేస్తున్నారు. అటు మామ కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ పైనా దృష్టి సారించాలి. అలాగే గద్వాల్ నియోజకవర్గంలోని డీకే అరుణను ఓడించేందుకు పావులు కదపాలి. 

అలాగే తన నియోజకవర్గమైన సిద్ధిపేటపైనా దృష్టి కేంద్రీకరించాలి. అయితే ఎంపీ రాజీనామాతో మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించాలి. అలాగే సిద్ధిపేట పైనా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

ఎంపీ రాజీనామా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అయ్యింది. కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించి రేవంత్ రెడ్డిని ఓడిద్దామనుకున్న వారి ఆశలను ఆడియాశలు చేసింది ఎంపీ రాజీనామా. ఇంటగెలిచి రచ్చ గెలవాలని అంటుంటారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గాలపైనే ఈ మంత్రులిద్దరూ దృష్టి సారించాలి. 

లేని పక్షంలో అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రేవంత్ రెడ్డి మాత్రం మాంచి హుషారొచ్చింది. ఇక తన నియోజకవర్గంలో మంత్రులు లేరు గింత్రులు లేరు. తన నియోజకవర్గానికి తానే మంత్రి తానే రాజు అనేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో రేవంత్ అనుచర వర్గం మంచి జోష్ లో ఉంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కే

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

 

 

click me!
Last Updated Nov 20, 2018, 7:16 PM IST
click me!