Tollywood drug case: ఎక్సైజ్ శాఖకు నిందితుల చుక్కలు, ఆచూకీ లేని 20 మంది నిందితులు

By narsimha lodeFirst Published Sep 24, 2021, 11:57 AM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిందితులు 20 మంది ఇప్పటివరకు  ఆచూకీ లేకుండా పోయారు వారిని అరెస్టు చేయడంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. 20 మంది అదృశ్యమయ్యారని కోర్టుకు ఎక్సైజ్ శాఖ తెలిపింది.


హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (tollywood drug case) ఎక్సైజ్ శాఖకు (excise )నిందితులు చుక్కలు చూపిస్తున్నారు.  ఈ కేసులో నిందితులుగా ఉన్న 20 మంది ఆచూకీ లేకుండా పోయారు.ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ కోర్టుకు తెలిపింది. 

2017లో డ్రగ్స్ కు సంబంధించి తెలంగాణ ఎక్సైజ్ శాఖ 12 కేసులు నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి 12 ఛార్జీషీట్లను తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించింది. టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులకు డ్రగ్స్ తో సంబంధాలపై నమోదైన కేసు సంచలనం సృష్టించింది. అయితే ఇటీవలనే సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాక క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

డ్రగ్స్ కేసులో  నిందితులుగా ఉన్న వారిలో 20 మంది ఆచూకీ లేకుండాపోయిందని ఎక్సైజ్ శాఖాధికారులు కోర్టుకు తెలిపారు.2019 నుండి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యమయ్యారు. 2020 నుండి కోర్టుకు హాజరు కాని కెల్విన్. కానీ ఇటీవల కాలంలో  సినీ తారలను ఈడీ విచారించింది. ఈ సమయంలో కెల్విన్ న్ కూడా ఈడీ అధికారులు విచారించారు.

మూడుసార్లు నోటీసులిచ్చినా కూడ కెల్విన్ విచారణకు హాజరు కాలేదు. 2018 నుండి కోర్టుకు అబూ బకర్ హాజరు కాలేదు.ముషీరాబాద్ ఎక్సైజ్ కేసులో నిందితుడుగా సోహైల్ పరారీలో ఉన్నాడు.  డ్రగ్స్ కేసులో విదేశాలకు పారిపోయాడు  మైక్ కమింగా. నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా పట్టుకోవడంలో  నిర్లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి.

click me!