Today's Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం భారీగా అప్లికేషన్లు, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. తాటికొండ రాజయ్య రాజీనామా, వైసీపికి షాకిచ్చిన మచిలిపట్నం ఎంపీ, షర్మిల మాకు రాజకీయ శత్రువే : పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి ఇంట సీఎం రేవంత్ సందడి, బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న.., అందరిని ఫూల్ చేసిన పూనమ్ పాండే.. బతికే ఉన్నట్టు పోస్ట్., నోటీసులకు స్పందించని కేజ్రీవాల్.. , బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల ..వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
(నోట్- పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
ఎంపీ సీట్ల కోసం భారీగా అప్లికేషన్లు..
Congress MP Applications: కాంగ్రెస్ బీ ఫామ్ కోసం నాయకులు భారీగా పోటీ పడుతున్నారు. ఆశావహుల నుంచి అప్లికేషన్ల స్వీకరణకు శనివారం డెడ్ లైన్ కాగా.. చివరి రోజు దాదాపు 166 మంది అప్లై చేసుకున్నారు. దీంతో మొత్తంగా 306 దరఖాస్తులు వచ్చాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. తాటికొండ రాజయ్య రాజీనామా..
స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే (Former MLA of Station Ghanpur) తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్ఎస్ (BRS)కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు త్వరలోనే ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy)సమక్షంలో కాంగ్రెస్ పార్టీ (Congress) లో చేరే అవకాశం ఉంది.
వైసీపికి షాకిచ్చిన మచిలిపట్నం ఎంపీ..
Vallabhaneni Balashowry: మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయం రసవత్తంగా మారుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్పులు చేస్తూ వైసీపీ ఆరు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. పార్టీలో ఇంఛార్జ్ ల మార్పు వేళ సీట్లు దక్కని కొందరు నేతలు పార్టీ వీడుతున్నారు. ఇదే సమయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా వైసీపీ వీడుతున్నారని ప్రచారం మొదలైంది. ప్రచారంపై ఎంపీ వల్లభనేని బాలశౌరినే నేరుగా స్పందించారు. తాను జనసేనలో చేరుతున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రకటించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో తాను ఆదివారం (ఫిబ్రవరి 4) జనసేనలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు.
షర్మిల మాకు రాజకీయ శత్రువే : పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ కుటుంబం విడిపోవడానికి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి, జగన్‌ను జైల్లో పెట్టడానికి, రాష్ట్ర విభజనకు మూల కారణం చంద్రబాబేనంటూ పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉచ్చులో వున్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామన్నారు. వైఎస్ కుటుంబం విడిపోవడానికి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడానికి, జగన్‌ను జైల్లో పెట్టడానికి, రాష్ట్ర విభజనకు మూల కారణం చంద్రబాబేనంటూ పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఆరు జాబితాల అభ్యర్థుల పూర్తి వివరాలు ఇవే...
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తాజాగా పదిమందితో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇంకొన్ని జాబితాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇప్పటివరకు అధికార వైసీపీ16 ఎంపీ, 75 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 9 ఎంపీ, వంద ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలి. ఇంకా ప్రకటించాల్సి ఉన్న 9 ఎంపీ సీట్లో ముగ్గురు సిట్టింగులు కన్ ఫం అని సమాచారం. 3 సిట్టింగుల్లో.. రాజంపేటనుంచి మిథున్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, కడప ఎంపీ అవినాష్ లు ఉన్నారు. అంటే ఇంకో ఆరుగురిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది.
చిరంజీవి ఇంట సీఎం రేవంత్ సందడి
Chiranjeevi: తెలుగు చిత్ర సీమకు చేసిన విశేష సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించిన చిరంజీవికి మెగా కోడలు ఉపాసన ఓ సర్ ప్రైజ్ ఫ్లాన్ చేసింది. తన నివాసంలో అభినందన సభను ఏర్పాటు చేసింది. చాలా గ్రాండ్ పార్టీని ఇచ్చింది. ఈ అభినందన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అందరిని ఫూల్ చేసిన పూనమ్ పాండే.. బతికే ఉన్నట్టు పోస్ట్.
Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయినట్టు శుక్రవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ పెట్టిన విసయం తెలిసిందే. ఈ పోస్ట్ చూసి అంతా షాక్ అయ్యారు. సర్వైకల్ కాన్సర్‌తో పూనమ్ చనిపోయిందని వారి పీఆర్ టీమ్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. దీంతో ఇది పెద్ద దుమారం సృష్టించింది. అయితే దీనిపై చాలా రూమర్స్ వచ్చాయి. అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ గర్భాశయ కాన్సర్‌తో అంత త్వరగా చనిపోరని అంతా భావించారు. ఇదేదో పెద్ద కుట్ర, మోసం ఉందన్నారు. ఇదేదో పీఆర్ స్టంట్‌లాగా ఉందన్నారు.
బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న..
బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ .కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. దీనిమీద ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత ఉపప్రధానిగా, బీజేపీ సీనియర్ నేతగా ఆయన సేవలను ప్రధాని ప్రశంసించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పోషించిన పాత్ర కీలకం అంటూ ప్రశంసించారు. ‘ఎల్‌కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నామని తెలపడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే నేను ఆయనతో ఈ విషయాన్ని మాట్లాడి అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఎల్ కే అద్వానీ ఒకరు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మరణీయమైనది. అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుంచి దేశ ఉప ప్రధానమంత్రిగా సేవలందించడం వరకు ఆయన కృషి ఎంచదగినది. అద్వానీ హోం మంత్రిగా, I&B మంత్రిగా సేవలందించారు’ అని పేర్కొన్నారు.
నోటీసులకు స్పందించని కేజ్రీవాల్..
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌పై ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 7న కోర్టు ఈ అంశాన్ని విచారించనుంది. ఇటీవల ఈడీ ఆయనకు ఐదోసారి నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించలేదు. గడిచిన నాలుగు నెలల్లో కేజ్రీవాల్ నాలుగు సమన్లను దాటవేశారు.
బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల .. 171 పరుగుల ఆధిక్యంలో భారత్..
విశాఖపట్నంలో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో వున్నారు. మొత్తంగా భారత్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో వుంది. అంతకు ముందు బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ కుప్పకూలింది. యార్కర్లలో ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. బుమ్రాకు జోడీగా కుల్దీప్ యాదవ్ కూడా సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుని ఇంగ్లాండ్ ను 253 పరుగులకు ఆలౌట్ చేశారు.