Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య రాజీనామా..

స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే (Former MLA of Station Ghanpur) తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) బీఆర్ఎస్ (BRS)కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు (TatiKonda Rajaiah resigns from BRS). త్వరలోనే ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth reddy)సమక్షంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరే అవకాశం ఉంది.

Tatikonda Rajaiah resigns from BRS..ISR
Author
First Published Feb 3, 2024, 10:31 AM IST | Last Updated Feb 3, 2024, 10:31 AM IST

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీబీసీ అధ్యక్షులు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు వైదొలుగుతున్నాయి. ఇందులో అధిక శాతం మంది అధికార కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి కు రాజీనామా చేశారు.

మేడారం వెళ్తున్నారా ? తొలి మొక్కు ఎక్కడ చెల్లించాలో తెలుసా ? (ఫొటోలు)

గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టిక్కెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేశారు. 

మల్లారెడ్డిని బర్రె కరిచిందనుకుంటా.. బీఆర్ఎస్ శకం ముగిసింది - బండ్ల గణేష్

కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన డప్పు కూడా కొట్టి, శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు. అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందించారు.

భర్త శాడిజం.. 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్య బందీ.. కిటికీ ద్వారానే పిల్లల బాగోగులు..

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టిక్కెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టిక్కెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయనతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios