నగ్న వీడియోలతో బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య

By Rajesh Karampoori  |  First Published Oct 23, 2023, 8:13 AM IST

సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అతడి మార్ఫింగ్‌ నగ్న వీడియోలు పంపించి డబ్బులు డిమాండ్‌ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ లో జరిగింది.


సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమంది తమ ఎదుగుదల కోసం వాడుకుంటుంటే.. కొందరు మాత్రం తప్పుడు పనుల కోసం ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు యువతను టార్గెట్ చేస్తున్నారు . ఈజీ మనీ పేరిట వారిని అట్రాక్ట చేస్తున్నారు. వారి ఫోన్లకు ఫేక్ లింక్స్ పంపించడం, ఆ తరువాత మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి, అకౌంట్ నుంచి డబ్బులు దోచుకోవడం పరిపాటిగా మారింది.

మరోవైపు.. అందమైన అమ్మాయిని రంగంలోకి దింపి, సోషల్ మీడియా యాప్స్ ద్వారా అబ్బాయిల్ని వలపు వల వేయడం, ప్రయివేట్ చాట్ , వీడియో కాల్స్ మాట్లాడటం, వాటిని రికార్డు చేసి తర్వాత బెదిరింపులకు పాల్పడటం. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ  ‘హనీ ట్రాప్’ కేసుల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 

Latest Videos

తాజాగా అలాంటి ఘటననే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయిని రంగంలోకి దింపి, సోషల్ మీడియా యాప్స్ ద్వారా  ఓ అబ్బాయిల్ని బుట్టలో పడేసి, వీడియో కాల్స్ మాట్లాడి .. ఆ తరువాత వాటిని నగ్న వీడియోలు మార్చారు. వాటిని పంపించి డబ్బులు డిమాండ్‌ చేస్తూ..  బెదిరింపులకు పాల్పడ్డారు. భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. వారి వేధింపులు భరించలేక మనస్తాపం చెంది  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ  ఘటన హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన యువకుడు(22) బీటెక్‌ పూర్తి చేశాడు. కంప్యూటర్‌ కోర్సు నేర్చుకోవడానికి నెల కిందట హైదరాబాద్ కు వచ్చాడు. ఈ క్రమంలో ఎస్సార్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు.  ఇటీవల అతనికి సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది.  ఆ తరువాత నెంబర్లు మార్చుకోవడం, చాట్ చేయడం , వీడియో కాల్‌లో మాట్లాడటం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆ యువతి అతని కాల్‌ రికార్డును నగ్న వీడియోగా మార్ఫింగ్‌ చేసి పంపించింది.
 
అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో ఓసారి రూ.10 వేలు పంపాడు. కానీ. మరింత డబ్బు కావాలని వేధించడంతో ఆ యువకుడు డబ్బు పంపించలేకపోయాడు.దీంతో వారు ాఆ యువకుడి మిత్రులకు ఆ వీడియోలు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు హాస్టల్‌ గదిలో ఉరేసుకొని తనువు చాలించాడు.

click me!