రేప్ కేసులో ఐఐఎం విద్యార్థి అరెస్ట్

By ramya neerukondaFirst Published Sep 29, 2018, 10:55 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ కి చెందిన యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. 
 

ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన ఐఐఎం విద్యార్థిని భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. రేప్, చీటింక్ కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పూర్తివివరాల్లోకి వెళితే..రిబు రంజన్ సాహా(27) ప్రస్తుతం ఉప్పల్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో అతను యూకేలో పీజీ చేశాడు. ఆ సమయంలో తనతోపాటు అక్కడ విద్యనభ్యసించిన  యువతిని ప్రేమించాడు. పశ్చిమ బెంగాల్ కి చెందిన యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మబలికాడు. 

అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసిన రిబు.. యువతిని దూరంగా పెట్టాడు. ఇటీవల యువతి హైదరాబాద్ వచ్చి.. పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రతిపాదించగా..చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో.. మోసపోయినట్లు గుర్తించిన యువతి.. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  రేప్, చీటింగ్ తదితర కేసులు అతని పై నమోదు చేసినట్లు తెలిపారు. ముందు ఈ కేసును రాచకొండ పోలీసులు స్వీకరించగా.. తర్వాత భువనగిరి పోలీసులకు అప్పగించారు. 

click me!