టీవీల్లో పాఠాలు చెబితే సందేహాలు ఎలా తీర్చుకోవాలి?: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

By narsimha lodeFirst Published Aug 27, 2020, 2:47 PM IST
Highlights

టీవీల్లో పాఠాలు చెబితే విద్యార్థుల సందేహాలను ఎలా నివృత్తి చేస్తారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

హైదరాబాద్: టీవీల్లో పాఠాలు చెబితే విద్యార్థుల సందేహాలను ఎలా నివృత్తి చేస్తారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఆన్ లైన్ క్లాసులు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై తెలంగాణ హైకోర్టులో గురువారం నాడు విచారించింది.ఆన్ లైన్ క్లాసులపై విధి విధానాలను ఖరారు చేసినట్టుగా హైకోర్టుకు వివరించింది తెలంగాణ ప్రభుత్వం.

టీశాట్, దూరదర్శన్ ద్వారా క్లాసులు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆన్ లైన్ క్లాసులునిర్వహించే సమయంలో విద్యార్థులు అనుమానాలు ఎలా నివృత్తి చేసుకొంటారని హైకోర్టు ప్రశ్నించింది.విద్యార్థులకు అనుమానాలు వస్తే టీవీ పాఠాల్లో ఎలా నివృత్తి చేసుకొంటారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

విద్యార్థుల నివృత్తికి స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపింది.ఒకే కుటుంబంలో ముగ్గురు విద్యార్థులుంటే ఒకేసారి వారంతా పాఠాలు ఎలా వింటారో చెప్పాలని హైకోర్టు కోరింది. 

1నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు వేర్వేరు టైములలో పాఠాలను ప్రసారం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల అటెండెన్స్ తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.


also read:తెలంగాణలో సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం: ఇంటర్‌ సహా పీజీ వరకు ఆన్ లైన్ క్లాసులు

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేర్వేరు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులపైనే తమ ఆందోళన అని హైకోర్టు చెప్పింది.

ప్రభుత్వ విధి విధానాలపై అభ్యంతరాలుంటే తెలపాలని పిటిషనర్లకు కోరింది తెలిపింది హైకోర్టు.ఫీజులు చెల్లించకపోతే ఆడ్మిషన్లు రద్దు చేస్తున్నారని హెచ్ఎస్‌సీఏ తరపున లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.ఫీజుల విషయంలో ఇప్పటికే జీవోను జారీ చేసినట్టుగా ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. 

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఉల్లంఘించిన విద్యాసంస్థలపై ఏం చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇప్పటికే అలాంటి విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. మరో వైపు కొన్ని విద్యా సంస్థల గుర్తింపు ప్రక్రియను రద్దు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.

click me!