మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

By narsimha lode  |  First Published Oct 14, 2018, 2:05 PM IST

తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ సభలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కోర్ కమిటీ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది



హైదరాబాద్: తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ సభలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కోర్ కమిటీ ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. అక్టోబర్ 20, 27 తేదీల్లో రాహుల్ గాంధీ సభలను ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం ఆదివారం నాడు హైద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు,  రాహుల్ గాంధీ సభల ఏర్పాట్లపై చర్చించారు.

Latest Videos

ఈ నెల 20వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సభలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు  భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన  బోథ్,  కామారెడ్డిలలో రాహుల్ గాంధీ  సభలను ఏర్పాటు చేయాలని  ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన కరీంనగర్, వరంగల్‌లలో ఏదో ఒక చోట సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

బోథ్ కంటే  ముథోల్‌లో సభ పెడితే ప్రయోజనంగా ఉంటుందని  ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.మరోవైపు  కొడంగల్‌లో  కాంగ్రెస్ పార్టీ ప్రచార సభను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో  కోరారు.  కామారెడ్డి సభకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధు యాష్కీ,  ఎఐసీసీ ఇంచార్జీ సలీం ఇంచార్జీగా నియమించారు.

బోథ్ లేదా ముథోల్ లో నిర్వహించనున్న సభకు  ఎఐసీసీ ఇంచార్జులు  శ్రీనివాసన్, బోస్ రాజులకు బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే  మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటు ఇంకా ఫైనల్ కాలేదు. మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్ధుబాటు వ్యవహారాన్ని ఫైనల్ చేసే బాధ్యతను  మాజీ మంత్రి  కుందూరు జానారెడ్డికి అప్పగించారు.

సంబంధిత వార్తలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

click me!