జనాలు చూస్తారని...బావిలోకి తోసి, బాలికపై

sivanagaprasad kodati |  
Published : Oct 14, 2018, 01:38 PM IST
జనాలు చూస్తారని...బావిలోకి తోసి, బాలికపై

సారాంశం

ఓ కామాంధుడు బాలికపై అత్యాచారయత్నం చేసేందుకు పాడుపడిన బావిని ఎన్నుకున్నాడు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి  చెందిన బాలిక హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

ఓ కామాంధుడు బాలికపై అత్యాచారయత్నం చేసేందుకు పాడుపడిన బావిని ఎన్నుకున్నాడు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి  చెందిన బాలిక హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

దసరా సెలవులు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. వ్యవసాయ పనులు చేసే తల్లిదండ్రులు.. శనివారం పనికి వెళ్లిపోయారు.. ఈ క్రమంలో బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉంది.. ఆమెను గమనించిన పక్కింటి కుర్రాడు రాజేశ్‌చారి బాలికను బలవంతంగా భుజాన వేసుకుని రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్తుండటంతో ఆమె కేకలు వేసింది.

ఆమె అరుపులు విని గ్రామస్తులు వస్తుండటంతో భయపడిపోయిన రాజేశ్ బాలికను సమీపంలోని పాడుపడిన బావిలో పడేసి.. తాను కూడా దూకాడు.. దీంతో బాలిక తలకు, కాళ్లకు తీవ్రగాయాలై.. రక్తస్రావం జరుగుతోంది. అయినప్పటికీ ఆ కామాంధుడు ఆమెను వదలకుండా అత్యాచారయత్నం చేస్తూనే ఉన్నాడు.

బావి వద్దకు చేరుకున్న స్థానికులు అతడిని బెదిరించి తాళ్ల సయాంతో బాలికను పైకి లాగి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.. నిందితుడిపై దాడికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులను అడ్డుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు.

రాజేశ్ ఇంటర్‌తో చదువు ఆపేసి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.. అతడి కుటుంబసభ్యులు తరచూ తోటి వారితో గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన రాజేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌