ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. కోడెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కోడెల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని...డాక్టర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన టీడీపీలో చేరి ప్రజాకర్షణ కలిగిన నేతగా ఎదిగారన్నారు.
కోడెల మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపుతూ ట్వీట్ చేశారు.
కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. కోడెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మరోవైపు శివప్రసాదరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల ప్రజలకు ఎంతగానో సేవ చేశారని.. స్పీకర్‌గా సభను హుందాగా నడిపారని గవర్నర్ తన సంతాప ప్రకటనలో తెలియజేశారు.
తెలుగుజాతికి తీరని లోటు: లక్ష్మణ్
కోడెల శివప్రసాదరావు మరణం తెలుగుజాతికి తీరని లోటన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. తెలుగు రాజకీయాల్లో ఆయన తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి, ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రావడం చాలా గొప్పవిషయమని లక్ష్మణ్ తెలిపారు.
అటు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం కోడెల మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. శివప్రసాదరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్ల కోడెల మరణం: యనమల
వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల మరణించారంటూ వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. శివప్రసాదరావు తన చివరి శ్వాస వరకు తెలుగుదేశం కోసం పరితపించారన్నారు.
ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఒక స్నేహితుడిని కోల్పోయానని, కోడెల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
వైసీపీ వేధింపుల వల్లే.. ఇది రాజకీయ హత్యే: యరపతినేని
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపట్ల.. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. వైసీపీ వేధింపుల వల్లే కోడెల మరణించారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన మరణం టీడీపీ తీరని లోటని యరపతినేని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం
నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య
కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్
ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌లు అప్పగింత
శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...
నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?
నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల
కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?
కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు