టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని... వ్యక్తి మృతి

By telugu teamFirst Published Sep 16, 2019, 9:51 AM IST
Highlights

ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే.. తన వాహనాన్ని అక్కడే వదిలేసి.. డ్రైవర్ తో సహా పరారయ్యాడు. దీంతో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.  బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించడంతో శ్రీశైలం-హైదరాబాదు ప్రధానరహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రయాణికులు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు ఎక్కడికక్కడే నిలిపోయాయి.

ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. కాగా..  ఘటన జరిగిన అనంతరం ఎమ్మెల్యే, కారు డ్రైవర్  అక్కడి నుంచి పరారవ్వడం గమనార్హం. ఈ సంఘటన మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగన్నాథం(40) మండలంలోని తుమ్మలూరు పరిధి భాష్యం స్కూల్‌లో మేస్ర్తీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని స్కూల్‌ ఆవరణ నుంచి భయటకు వచ్చి రోడ్డు క్రాస్‌ చేస్తున్న జగన్నాథాన్ని కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే.. తన వాహనాన్ని అక్కడే వదిలేసి.. డ్రైవర్ తో సహా పరారయ్యాడు. దీంతో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.  బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించడంతో శ్రీశైలం-హైదరాబాదు ప్రధానరహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రయాణికులు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు ఎక్కడికక్కడే నిలిపోయాయి.

 దీంతో మహేశ్వరం పోలీసులు రంగంలోకి దిగి ధర్నాకు దిగిన వారిని శాంతింపజేసే ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చే ప్ర యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదం చేసిందే కాక.. ఎమ్మెల్యే ఇక్కడి నుంచి పరార్ అయ్యి.. ఎలాంటి గాయాలు కాకపోయినా ఆస్పత్రిలో చేరడాన్ని మృతుడి కుటుంబసభ్యులు తప్పుపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!