రంగంలోకి దిగిన సుహాసిని:టీడీపీ నేతలకు ఫోన్, సహకరించాలని విజ్ఞప్తి

By Nagaraju TFirst Published Nov 16, 2018, 9:04 PM IST
Highlights

కూకట్‌పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి సుహాసిని జోరు పెంచారు. స్థానిక నాయకుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మెుదలెట్టారు. తన రాజకీయ అభ్యర్థిత్వంపై శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిని ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్‌: కూకట్‌పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి సుహాసిని జోరు పెంచారు. స్థానిక నాయకుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మెుదలెట్టారు. తన రాజకీయ అభ్యర్థిత్వంపై శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడిని ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 

కూకట్ పల్లి నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్న ఆమె ప్రజలకు సేవ చేసేందుకు ఇది ఒక వరంలా భావిస్తానన్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించిన ఆమె తరువాత తన రాజకీయ చతురతకు పదును పెట్టారు. 

ముందుగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ఫోన్లు చేశారు. పార్టీ తనకు అవకాశం ఇచ్చిందని సహకరించాలని కోరారు. టీడీపీ సీనియర్‌ నేతలు పెద్దిరెడ్డి, మందాడికి ఫోన్ చేశారు. ఇరు నేతల మద్దతును ఆమె కోరారు. దీంతో వారు సుహాసిని గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. 

మరోవైపు హరికృష్ణ నివాసంలో సుహాసినిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు కలిశారు. టీడీపీ అభ్యర్థిగా ఎంపికైనందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సుహాసిని గెలిచేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 

దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ లో స్థాపించారని ఇక్కడే సుహాసిని పోటీ చెయ్యడం సంతోషకరమన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన ఆయన ఆత్మ తెలంగాణలోనే ఉంటుందన్నారు. నష్టమని తెలిసినా తెలంగాణ రాష్ట్రం విషయంలో టీడీపీ ముందుకెళ్లిందని తెలిపారు. త్వరలో టీడీపీకి పునర్వైభవాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 12మంది అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

 

click me!