కేసీఆర్ నియంతృత్వపాలనకు అడ్డుకట్ట వేద్దాం:ఖుష్బూ

By Nagaraju TFirst Published Nov 16, 2018, 8:14 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబమే పాలిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సినీనటి ఖుష్భూ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖుష్బూ టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన నలుగురే  నాలుగు కోట్ల మందిని పాలిస్తున్నారని మండిపడ్డారు. 

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబమే పాలిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సినీనటి ఖుష్భూ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖుష్బూ టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన నలుగురే  నాలుగు కోట్ల మందిని పాలిస్తున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్ కుటుంబ నియంతృత్వానికి అడ్డుకట్టవేసేది కేవలం కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు మంత్రి పదవులు సైతం దక్కుతాయన్నారు. 

బతుకమ్మ చీరల పేరుతో రూ.225 కోట్లు పక్కదారి పట్టాయని ఖుష్భూ ఆరోపించారు. నాసిరకం చీరలు పంచి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తమ పార్టీ టీఆర్ఎస్ పార్టీలా అమలు సాధ్యం కానీ హామీలు ఇవ్వదని అమలు చేసే హామీలు మాత్రమే ఇస్తుందన్నారు. 

మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని రెండు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ లా తమది మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని ఖుష్బూ అన్నారు.

click me!