సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య: జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Sep 17, 2021, 4:21 PM IST
Highlights


సైదాబాద్ మైనర్ బాలిక రేప్, హత్య ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించాలని పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు జ్యూడీషీయల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్: సైదాబాద్ మైనర్ బాలిక రేప్, హత్య ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యూడిషీయల్ విచారణకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. వరంగల్ మూడో మేజిస్ట్రేట్ ను విచారించాలని ఆదేశించింది హైకోర్టు. నాలుగు వారాల్లో నివేదికను సీల్డ్ కవర్లో పంపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.రాజు ఆత్మహత్యపై పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. 

also read:రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు కూడ ఆరోపించారు. పోలీసులే ముందుగా పట్టుకొన్నారని వారు ఆరోపించారు.దీంతో పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ నిర్వహించాలని  కోరారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. రాజు ఆత్మహత్య చేసుకొన్నాడని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఏడుగురు సాక్షుల వాంగ్మూలాన్ని కూడ రికార్డు చేశామన్నారు.

వినాయక చవితి రోజున సైదాబాద్ సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై రాజు అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఈ నెల 16న నిందితుడు స్టేషన్ ఘన్ పూర్ కు సమీపంలోని రాజారాం బ్రిడ్జి వద్ద కోణార్క్ ఎక్స్ ప్ెస్ కు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 

click me!