సైదాబాద్ మైనర్ బాలిక రేప్ హత్యకు పాల్పడిన నిందితుడు రాజు ఆత్మహత్య విషయమై ఎలాంటి అనుమానాలొద్దని  తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై ఏమైనా ఆధారాలుంటే చూపాలని ఆయన కోరారు. 


హైదరాబాద్:సైదాబాద్ మైనర్ బాలిక రేప్ హత్యకు పాల్పడిన నిందితుడు రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాజు ఆత్మహత్య చేసుకొంటున్న సమయంలో ఏడుగురు ప్రత్యక్షంగా చూశారని ఆయన తెలిపారు.

శుక్రవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఇద్దరు డ్రైవర్లు. ముగ్గురు రైతులు, ఇద్దరు గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఉన్నారని డీజీపీ వివరించారు.సాక్షుల స్టేట్‌మెంట్ వీడియో రికార్డు చేసినట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాజు ఆత్మహత్యపై ఘణపూర్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో డ్రైవర్లు ఇద్దరు ఘటనను అధికారికంగా రికార్డు చేశారని డీజీపీ చెప్పారు.

also read:సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య: విచారణ కోరుతూ హైకోర్టులో పౌరహక్కుల సంఘం పిటిషన్

రాజు ఆత్మహత్యపై అనవసర రాద్దాంతాలు వద్దని ఆయన తేల్చి చెప్పారు.ఎవరి వద్దనైనా ఆధారాలుంటే మాట్లాడాలని డీజీపీ కోరారు.తప్పుదోవపట్టించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని ఆయన కోరారు.మావోయిస్టు నేత శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు.

శారదక్క స్వస్థలం మహబూబాద్‌ జిల్లాలోని గంగారం. పీపుల్స్‌వార్‌ పార్టీకి ఆకర్షితురాలైన ఆమె 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. కాగా, శారదక్క భర్త అయిన మావోయిస్టు నేత హరిభూషణ్.. ఈ ఏడాది జూన్‌ 21 కరోనాతో చనిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గంటలకు శారదక్క లొంగుబాటుకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాకు వెల్లడించనున్నారు.