బస్సు బొల్తా.. తెలంగాణలో తృటిలో తప్పిన మరో ఘోర విషాదం

Published : Sep 19, 2018, 09:21 AM IST
బస్సు బొల్తా.. తెలంగాణలో తృటిలో తప్పిన మరో ఘోర విషాదం

సారాంశం

తెలంగాణకు మరో ఘోర విషాదం తృటిలో తప్పిపోయింది. సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మునగాల వద్ద అదుపు తప్పి పల్టీ కొడుతూ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. 

గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డారు... ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో పది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు..

అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ బస్సు శ్రీకృష్ణా ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. కొద్దిరోజుల క్రితం జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా మరణించారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆ చిన్నారిని చూసి భావోద్వేగానికి గురైన ఈటల

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు ప్రమాదానికి కారణమిదే: బట్టబయలు చేసిన కండక్టర్

కొండగట్టు విషాదం: ఐస్‌బాక్స్‌లో శవాన్ని పెట్టేందుకు డబ్బులు లేక.. ఐస్‌గడ్డలపై వరిపొట్టు పోసి

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్