మైనర్‌పై గ్యాంగ్ రేప్: ఆ మొబైల్ ఫోన్సే కీలకం

By narsimha lodeFirst Published Jan 15, 2019, 12:22 PM IST
Highlights

:పాతబస్తీలో మైనర్ బాలికపై 11 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్నడిన ఘటనపై  కీలకమైన ఆధారాలను  పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు

హైదరాబాద్:పాతబస్తీలో మైనర్ బాలికపై 11 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్నడిన ఘటనపై  కీలకమైన ఆధారాలను  పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ విషయమై హోంమంత్రి మహమూద్ అలీ దర్యాప్తుకు ఆదేశించారు.

పాతబస్తీ కామాటీపురలో మైనర్ బాలికపై 11 మంది నాలుగేళ్లుగా గ్యాంగ్‌రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలిపై  అత్యాచారానికి పాల్పడిన నిందిుతుల ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు.

మైనర్ బాలికపై  ఆమె సమీప బంధువు కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  సమయంలో తీసిన వీడియోలతో  బాధితురాలిపై నాలుగే
ళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై  బాధితురాలి కుటుంబం గత  ఏడాది డిసెంబర్ 24 వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు సాక్షిగా చేర్చడంపై బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది.ఆందోళనకు దిగింది.

ఈ కేసులో బాలిక బంధువు రాజేష్, అతని స్నేహితులు శుభం వ్యాస్, అభిజిత్‌లరె అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడు విజయ్ కుమార్ ను కూడ పోలీసులు బాధిత కుటుంబం ఆందోళనతో అరెస్ట్ చేశారు.  మరో ఏడుగురు కూడ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు చెప్పడంతో వీరి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన సమయంలో నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు ప్రస్తుతం పోలీసులకు కీలకంగా మారాయి. ముగ్గురు నిందితుల మొబైల్ ఫోన్లలో బాధితురాలిపై అత్యాచార దృశ్యాలు ఉన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఈ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.  ఈ ఫోన్లలో అత్యాచార దృశ్యాలు లేవు. దీంతో ఈ వీడియోలను గుర్తించేందుకు ఈ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీంతో ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు.

పోలీసుల తీరును నిరసిస్తూ స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో  ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.  ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీసీఎస్ ఏసీపీ శ్రీదేవికి అప్పగించారు.

సంబంధిత వార్తలు

పాత బస్తీలో అమ్మాయిపై 11 మంది రేప్: మహిళా అధికారి దర్యాప్తు

మైనర్‌పై 11 మంది గ్యాంగ్‌రేప్: హోం మంత్రి సీరియస్

రెండేళ్లుగా అమ్మాయిపై 11 మంది రేప్: నిందితులు వీరే..

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: వీడియోలు తీసి 4 ఏళ్లుగా అత్యాచారం (వీడియో)

click me!