భార్య నగ్న చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన భర్త

By telugu news teamFirst Published Jun 16, 2021, 8:16 AM IST
Highlights

భార్య అలా తనను వదిలేసి వెళ్లి పోయిందని కక్ష పెంచుకున్నాడు.  పవన్ ధడ్కన్ అనే మారుపేరుతో ఫేస్ బుక్ లో ఎకౌంట్ క్రియేట్ చేశాడు.

కట్టుకున్న భార్యకు ఏదైనా కష్టం వస్తే.. దగ్గరుండి తీర్చాల్సింది పోయి.. అతనే పెద్ద కష్టంగా మారాడు. భార్యకు తెలీకుండా.. ఆమె నగ్న చిత్రాలను తీసి.. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.  కాగా.. ఆ నీచపు భర్తను పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ సంఘటన నోయిడా నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గురుగావ్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మహిళ(28) తో 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇతనికి ప్రతి విషయంలో భార్యపై అనుమానం. దీంతో.. తరచూ ఆమెను హింసించేవాడు. దీంతో.. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె అతనిని వదిలేసి విడిగా ఉంటోంది. నోయిడాలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

కాగా.. భార్య అలా తనను వదిలేసి వెళ్లి పోయిందని కక్ష పెంచుకున్నాడు.  పవన్ ధడ్కన్ అనే మారుపేరుతో ఫేస్ బుక్ లో ఎకౌంట్ క్రియేట్ చేశాడు. గతంలో భార్యకు తెలియకుండా తన ఫోన్లో తీసిన ఫోటోలను ఆ ఫేస్ బుక్ లో పోస్టు చేయడం మొదలుపెట్టాడు.

 భార్య అశ్లీల చిత్రాలను అవమానకరమైన శీర్షికలతో పోస్టులు చేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు భర్తను అరెస్టు చేసి,ఆయన ఐటీ, ఐపీసీ 377,498 ఎ, 506,509 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిందితుడైన భర్తను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు

click me!