విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 21, 2018, 11:19 AM IST
Highlights

 మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  పార్టీని వీడినా నష్టం లేదని  తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్:  మేడ్చల్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  పార్టీని వీడినా నష్టం లేదని  తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విశ్వేశ్వర్ రెడ్డి ప్రజల మనిషి కాదన్నారు.  విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడితే ఏ మాత్రం నష్టం లేదని చెప్పారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డితో తాను నాలుగేళ్లన్నర ఏళ్ల పాటు కలిసి పనిచేసినట్టు  ఆయన గుర్తు చేసుకొన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి అంటే తనకు చాలా గౌరవం ఉందన్నారు.

ఏ ఉద్దేశ్యంతో  విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడారో తనకు తెలియదని మహేందర్ రెడ్డి చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, మంత్రి మహేందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఉంది.  ఈ విషయమై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా కూడ పార్టీ పట్టించుకోలేదనే భావనతో విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం సాయంత్రం టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ నెల 23వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.


సంబంధిత వార్తలు

ఢిల్లీలో కొండా రాజకీయాలు.. ఇవాళ రాహుల్‌‌ గాంధీతో భేటీ

విశ్వేశ్వర రెడ్డి రాజీనామా: ఆయన చెప్పిన ఐదు కారణాలు ఇవీ...

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా (వీడియో)

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

 

click me!