సిరిసిల్లలో కేటీఆర్ పై నేరెళ్ల సంఘటన దెబ్బ?

By pratap reddyFirst Published Nov 21, 2018, 11:08 AM IST
Highlights

దళితులు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. సిరిసిల్లలో మొత్తం 2.05 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 35 వేల మంది దళిత ఓటర్లు. అభ్యర్థుల విజయావకాశాలను దాదాపుగా దళిత ఓటర్లే నిర్ణయిస్తారు.

సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రి కేటీ రామారావుపై నేరెళ్ల సంఘటన దెబ్బ పడుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. దళితులు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. సిరిసిల్లలో మొత్తం 2.05 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 35 వేల మంది దళిత ఓటర్లు.

అభ్యర్థుల విజయావకాశాలను దాదాపుగా దళిత ఓటర్లే నిర్ణయిస్తారు. నేరెళ్ల సంఘటన తర్వాత దళితులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇసుక లారీలను తగులబెట్టిన సంఘటనలో ఏడాదిన్నర క్రితం కొంత మంది దళితులను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈ సంఘటన తీవ్రమైన దుమారాన్ని రేపింది. 

ఈ సంఘటన నేపథ్యంలో కేటీఆర్ పై కొంత మంది తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే, ఇందులో కేటీఆర్ ప్రమేయం ఏమీ లేదని, పోలీసులు అతిగా ప్రవర్తించారని కొట్టిపారేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ స్థితిలో దళితుల అసంతృప్తిని తొలగించడానికి టీఆర్ఎస్ నేతల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


2009 వరకు నేరెళ్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆ తర్వాత దాన్ని సిరిసిల్ల నియోజకవర్గంలో విలీనం చేసారు. నేరెళ్ల సమీపంలో ఇసుక లారీ ఢీకొట్టడంతో 2017 జులై 2వ తేదీన బి. భూమయ్య మరణించాడు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం చెందిన దళితులు లారీలను తగులబెట్టారు. ఈ సంఘటనకు బాధ్యలను చేస్తూ పోలీసుులు 8 మందిపై కేసులు పెట్టి వారిని చిత్రహింసలు పెట్టారనే వివాదం అప్పట్లో చెలరేగింది. 

బాధితులను నెల పాటు జైల్లో పెట్టారు. థర్డ్ డిగ్రీ పద్థతిని ప్రయోగించడం వల్ల వాళ్లు నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు తమకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని చెప్పారు. టీఆర్ఎస్ నేతలతో పాటు కేటీఆర్ బాధితులతో మాట్లాడారు. ఒక్కొక్కరికి రూ. 4 లక్షల నష్టపరిహారం, ఓ ట్రాక్టర్, డబుల్ బెడ్రుం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 

నేరళ్ల ఘటనతో కేటీఆర్ కు సంబంధం లేదని, తమపై ఉన్న కేసులను ఎత్తేస్తామని టీఆర్ఎస్ నాయకులు హామీ ఇచ్చారని వారిలో నలుగురు మీడియాతో చెప్పారు. అయితే, దళిత సంఘాలు మాత్రం కేటీఆర్ నే బాధ్యుడిగా భావిస్తున్నాయి. 

సిరిసిల్ల మహా కూటమి అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి ఇంటర్వ్యూ 

సిరిసిల్లలో కేటీఆర్ తో ఢీ: కెకే మహేందర్ రెడ్డి ఏమంటున్నారంటే....(వీడియో)

click me!