ఈటలపై పోటీ చేస్తా.. ఈటల కారు డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodati  |  First Published Nov 10, 2018, 9:08 AM IST

టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్‌పై ఆయన మాజీ కారు డ్రైవర్ మేకల మల్లేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈటల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ.. ఆయనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు


టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్‌పై ఆయన మాజీ కారు డ్రైవర్ మేకల మల్లేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈటల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ.. ఆయనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు..

అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించానని తెలిపారు. తాను జైలు నుంచి విడుదలయ్యాక దాతలు తనను సన్మానించి ఆర్థిక సాయం కింద రూ.30 లక్షలు ఇచ్చారని.. వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు.

Latest Videos

జైలుకు వెళ్లడంతో ఉద్యోగం పోయిందని... తర్వాత కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తాను మంత్రి ఈటల రాజేందర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మల్లేశ్ యాదవ్ ప్రకటించారు.

ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజేందర్‌తో పాటు కొందరు తనకు అన్యాయం చేశారని.. తనకు ప్రాణహానీ ఉందని.. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాడు. 
 

ఏబీపీ-సీ ఓటర్ సర్వే... టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

అవసరం కొద్దీ కేసీఆర్‌‌నూ కలిశాడు: బాబుపై జానా వ్యాఖ్యలు

సవాళ్ల ఫలితం: రేవంత్, హరీష్, ఒంటేరు, రేవూరిలకు ఈసీ నోటీసులు

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: దిక్కుతోచని స్థితిలో సీపీఐ

ఖైదీలు పోటీ చేయొచ్చు, కానీ ఓటు హక్కుండదు

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించింది కేసీఆరే...రేవూరి సంచలన వ్యాఖ్యలు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

click me!