‘ఎమ్మెల్యే కారుకే సైడివ్వరా?’.. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై దౌర్జన్యం...

By AN TeluguFirst Published Nov 8, 2021, 10:23 AM IST
Highlights

కారులో నుంచి కొందరు కిందికి దిగి బస్సు డ్రైవర్ తో గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి కర్ర పట్టుకుని bus driver వీఆర్ రెడ్డిని బూతులు తిడుతూ, బస్సు డోరును లాగే యత్నం చేశాడు. డోరు తీయకపోవడంతో ఆ కర్రతో డోరును కొట్టాడు. దీనిని ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ లో వీడియో తీసి social mediaలో అప్ లోడ్ చేయడంతో viral అయ్యింది.

షాద్ నగర్ : ‘ఎమ్మెల్యే కారుకే సైడివ్వరా?’ అంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ ను బూతులు తిడుతూ ఓ వ్యక్తి దౌర్జన్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో మల్ చల్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం సూర్యజ్యోతి కాటన్ మిల్లు సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారి మీద ఆదివారం ఈ సంఘటన జరిగింది.

వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తోంది. వెనుక నుంచి వచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు (టీఎస్09 0809) ఓవరు టేక్ చేసి బస్సు ఎదుట నిలిపారు. 

కారులో నుంచి కొందరు కిందికి దిగి బస్సు డ్రైవర్ తో గొడవపడ్డారు. వారిలో ఓ వ్యక్తి కర్ర పట్టుకుని bus driver వీఆర్ రెడ్డిని బూతులు తిడుతూ, బస్సు డోరును లాగే యత్నం చేశాడు. డోరు తీయకపోవడంతో ఆ కర్రతో డోరును కొట్టాడు. దీనిని ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ లో వీడియో తీసి social mediaలో అప్ లోడ్ చేయడంతో viral అయ్యింది.

నల్గొండలో దారుణం... భార్యతో కలిసి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న పూజారి

కాగా, సదరు కారు మీద 14 Traffic‌ violationలకు సంబంధించి రూ. 14,490 చలానా పెండింగ్ లో ఉందని తెలిసింది. ఆర్టీఏ రికార్డుల ప్రకారం ఆ కారు వినోద్ అనే వ్యక్తిదని సమాచారం. 

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వీరంగం..

ఇదిలా ఉండగా... నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పోలీసులపై నోరు పారేసుకున్నారు. ‘‘నన్నే ఆపుతావారా?’’ అంటూ ఓ సీఐతో దురుసుగా వ్యవహరించాడు. 

ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదినకర్మకు హాజరయ్యేందుకు గువ్వల మహబూబ్ నగర్ వచ్చారు. మంత్రి వ్యవసాయ క్షేత్రం సమీపంలో ప్రధాన రహదారి మీద ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలకు parking ఏర్పాటు చేశారు. 

అయితే, అక్కడ వాహనాన్ని ఆపకుండా Guvvala Balaraju నేరుగా లోపలకు వెళ్లబోయాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకుని లోపలికి నేరుగా వెళ్లే అనుమతి లేదని చెప్పారు. దీంతో గువ్వల బాలరాజుకు కోపం వచ్చింది. పోలీసులపై మండిపడ్డారు. 

నన్నే ఆపుతావారా? అంటూ CI మీద విరుచుకుపడ్డారు. దీనికి గువ్వల బాలరాజుకు సీఐ ధీటుగా బదులిచ్చాడు. ‘మీరు ఎమ్మెల్యే అయితే policeలను పట్టుకుని ‘రా’ అనే అధికారం ఎవరిచ్చారు?’ అని గట్టిగా నిలదీశారు. ‘‘మీరు ‘రా’ అంటు మీ గౌరవం పెరగదు. మర్యాదగా మాట్లాడాలి’’ అని సూచించారు. 

ఈ సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య  తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరుగుతుండడం గమనించిన సీనియర అధికారి ఒకరు సముదాయించి ఎమ్మెల్యేను లోపలకు పంపారు. కాగా, ఇదే కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్ అప్పటికే మంత్రి వ్యవసాయ క్షేత్రంలో ఉండడం గమనార్హం. 

click me!