ఉరిశాల నుంచి సిరిశాలకు!

First Published Jul 24, 2018, 1:21 PM IST
Highlights

అరవయ్యవ దశకం నుంచి మరమగ్గాల పరిశ్రమ సిరిసిల్లాలో మొదలైనప్ప్పటికీఈ మూడేళ్ళుగానే అది నిరంతరాయమైన పనికి కేంద్రంగా మారుతున్నది.కనీస వేతనాల దరికి చేరుకున్నది.పురాతన మరమగ్గాల నుంచి మెల్లమెల్లగాఆధునికతను సంతరించుకుంటున్నది.

మంత్రికేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభినందనలతో సచిత్ర కథనం

ఉరిశాల నుంచి సిరిశాలకు!

అరవయ్యవ దశకం నుంచి మరమగ్గాల పరిశ్రమ సిరిసిల్లాలో మొదలైనప్ప్పటికీఈ మూడేళ్ళుగానే అది నిరంతరాయమైన పనికి కేంద్రంగా మారుతున్నది.కనీస వేతనాల దరికి చేరుకున్నది.పురాతన మరమగ్గాల నుంచి మెల్లమెల్లగాఆధునికతను సంతరించుకుంటున్నది.యజమాని, ఆసామి, కార్మికుడు- ఈముగ్గురూ నిలదొక్కుకోవడానికి తగిన చర్యలు నిలకడగా ప్రారంభమవుతున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే,సీమాంధ్రపాలనలో మరణమే శరణ్యం అనుకున్న సిరిసిల్ల మరనేత పరిశ్రమ నేడు తెలంగాణ రాష్ట్రంలో బంగారు బాటలోకి అడుగుపెడుతున్నది.ఇదికొత్త చరిత్ర. సిరిసిల్ల‘సిరిశాల’గా మారడానికి బీజం పడ్డ నవశఖం తాలూకు ఘనత.

దశాభ్దాలసీమాంధ్రుల పరిపాలన అనండీ లేదా సరైన విధాన పరమైన చర్యలు చేపట్టని ప్రభుత్వాలు ఆనండీ.వాస్తవిక పరిస్థితిని పట్టించుకోని స్థానిక నేతలుఅనండీ, సాంప్రదాయకమ్యూనిస్టు పోరాట వారసత్వాలూఅనండీ.అవన్నీకూడా సిరిసిల్ల ఉరిశాలగా మారుతుంటే సాక్షీ భూతాలుగానే వ్యవహరించడం ఒకచేదు నిజం.సిరిసిల్ల మరణాల గురించి అందరూ ఎప్పటికప్పుడుమొసలి కన్నీళ్లు కార్చిన వారే. నలుగురిలోఏడ్చి మొత్తుకున్నవారే గానీ సంక్షోభానికిఅసలు సిసలు మూల కారణాలను పట్టించుకున్న వారు లేరు.శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు నడుం కట్టిన వారుఅసలే లేరు.అదంతా గతం.గతానికి చెల్లు చీటీ పలుకుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం సిరిసిల్లకు గొప్ప ఉపశమనం.ఇది మొత్తం తెలంగాణకు వర్తించినా, సిరిసిల్లకు మటుకు అచ్చంగా పునరుజ్జీవన సందర్భం.

సిరిసిల్ల పరిశ్రమను నేరుగా పట్టించుకునేందుకువీలు కలిగింది రాష్ట్ర ఏర్పాటు తర్వాతే. అవును మరి.కేటీఆర్ ఇక్కడినుంచి శాసనసభకు వెళ్ళడమే కాదు,స్వయంగా చేనేత జౌళీశాఖామంత్రివర్యులు కావడంగొప్ప మేలైంది.దాంతోమరమగ్గాల పరిశ్రమ కింద తుక్కు తుక్కయిన బతుకులు నేడుతేట పడ్డాయి.నిజానికిఇనుపసామానుకింద అమ్మేయవలసిన వేలాదిమరమగ్గాలు నేడు బంగారం వలే బతుకమ్మ చీరలు నేస్తున్నై. ఇతర ప్రభుత్వ వస్త్రాలూ నేస్తున్నాయి.ఒక్క మాటలో మరణశయ్యపై నుంచి జీవగంజి పొందిన సిరిసిల్ల పరిశ్రమలో నేడు పాతిక వేల మంది కార్మికులకురెక్కడుతున్నదీ అంటేతెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమఫలితమే.

 

వందలే అని సంతోషపడాలి

మరి‘సిరిసిల్లలోఎందుకు వందలాది ఆత్మహత్యలు జరిగాయి’ అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అక్కడ ఏం జరిగిందో చూస్తే,‘వందలే ఎందుకున్నాయి, వేలకు వేలు ప్రాణాలు పోవాలిగదా!” అన్నట్టుంది అక్కడి పరిస్థితి.

 

అరవయ్యక దశకం దాకసిరిసిల్ల చేనేతపైనేబతికింది.సిరిశాలగానే నిలిచింది. అక్కడినుంచి మెల్లగా చేనేత పరిశ్రమమరమగ్గ పరిశ్రమకుమరిలింది. అది ఇంతితై వటుడింతై అన్నట్టు ఎనభయ్యవ దశకంలో మరింత విస్తరించింది.తొంభయ్యవ దశకంలో సంక్షోభంలోకి కూడా అడుగుపెట్టింది.2000 నుంచి వరుస ఆత్మహత్యలు మొదలయ్యాయి.ప్రభుత్వాలు రక్షణ చర్యలు చెప్పట్టడం మొదలెట్టారు. అందులోయజమానులకు మేలు చేసేటెక్స్ టైల్ పార్క్ ఒకటి, ఆసాములకు ప్రయోజనం కలిగించే యాభై శాతం విద్యుత్ సబ్సిడీ మరొకటి. కాగా,విద్యుత్ సబ్సిడీ మరో రూపంలో సిరిసిల్ల మరమగ్గాలను పెంచింది.20001కల్లా పదకొండు వేలున్న మరమగ్గాలు ౩౦ వేలు అయ్యాయి. కానీ, కార్మికుడిజీవితానికి భరోసా లభించలేదు.వేతనాలు పెరగలేదు. పనిపరిస్థితుల్లో మార్పు రాలేదు. తిరిగిఅత్యధికంగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. అప్పుడైనా దీర్ఘకాలికపరిష్కారాలు మొదలయ్యాయా అంటే లేదనే చెప్పాలి. కాకపోతే,2008లోమొదటిసారిగాపాలకులు ఈ పరిశ్రమను‘మరనేత పరిశ్రమ’ అని అర్థం చేసుకున్నారు. అప్పటిదాకా‘చేనేత పరిశ్రమే’అని భావించారు.ఇదితనంతట తానుగా మనుగడ సాగించలేని‘మరనేత పరిశ్రమ’ అని గ్రహించనేలేదు.ప్రభుత్వ అజమాయిషీ అవసరం అని ఎప్పుడూభావించనేలేదు. సంక్షోభానికి దారితీస్తున్న సమస్యలను ఏమాత్రంగమనంలోకి తీసుకోలేదు.అప్పడు కొన్ని ఉపశమన చర్యలు తీసుకున్నా అప్పటికే సిరిసిల్ల స్వయంగామరణశయ్యపైకి ఎక్కింది. ఒక రకంగా తన ఎదుగుదల తనకేభస్మాసుర హస్తంఅయింది.దాంతోఆత్మహత్యలు తగ్గాయి గానీ ఆగలేదు. ఏమైనా,ఈరెండు దశాభ్దాలుగా సిరిసిల్ల ఉరిశాలగానే ఉండిపోయింది.తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా సిరిసిల్ల సంక్షోభంలోనే ఉందని చెప్పాలి.ముఖ్యంగా2016నుంచిమళ్లే ఇక్కడిజీవితం ఊపిరి తీసుకుంది.

ఐతే,ప్రభుత్వాలుమూల సమస్యలపై దృష్టి పెట్టకపోవడంఈ సంక్షోభానికి ముఖ్య కారణం.పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులకు నిలకడగాఉపాధి లేకపోవడంఅసలుకారణం. ఉపాధితోపాటు వేతనాలు పెరిగే పరిస్థితి గురించిఎన్నడూ పట్టించుకోలేదు.దానికి తోడు నేతన్నలను మృత్యువు వైపు నెడుతున్నజీవన విధ్వంసానికి కారణంగా ఉన్న ఇతర సమస్యలేమిటో గమనించలేదు.దాంతోరెండు దశాభ్దాల సమయంలోనే సిరిసిల్ల ఒకసంక్షోభకార్కాణగామారిపోయి, వందలాదికుటుంబాలనుబలి తీసుకుంది.

సరిగ్గారెండు దశాభ్దాల సంక్షోభ కాలం అంటే తక్కువేమీ కాదు.1997లోఇక్కడతొలిసారిగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. చూస్తుండగానే ఒకరి వెంట ఒకరు ప్రాణాలు వదిలారు.2001లో దేశవ్యాప్తంగా సిరిసిల్ల వార్తల్లోకి ఎక్కింది. కొన్ని ఉపశమన చర్యలుచేపట్టినప్పటికీతిరిగి 2006లో ఆత్మహత్యలు మరింత వూపందుకున్నై. తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టాయి గానీఆగలేదనే చెప్పాలి.ఇప్పటివరకుప్రభుత్వంనష్టపరిహారం అందించిన మృతుల సంఖ్య అధికారికంగా397. ఇంకో రెండు వందలుకూడా ఉన్నాయని స్థానిక కార్మిక సంఘాలు అంటున్నాయి.

2001లో‘కొండ కిష్టయ్య కుటుంబంతో సిరిసిల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. కిష్టయ్యతండ్రి, తల్లి, కూతురు, పురుగుల మందు తాగి ఆత్మహత్యచేసుకోగా బతికి పోయిన అతడి చిన్న కూతురు , ఐదేళ్ళ పాపశాంతిప్రియకు ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు. ఇంత పెద్ద విషాదంఅప్పటికీఇప్పటికీసిరిసిల్లలో కనీవినీ ఎరగం. ఫలితంగా‘కొండ కిష్టయ్య కుటుంబం’అంటే, సిరిసిల్ల పరిశ్రమ సంస్కరణలకు మూలం మలుపుగా మారింది.అప్పటినుంచితీసుకున్న చర్యలేతెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా సిరిసిల్ల నిలదొక్కుకోవడానికి ఊతంగా ప్రభుత్వాలు చూపించాయి గానీ పరిశ్రమ సమస్యలు బహుముఖాలు అని గ్రహించలేదు.ఏమైనాఅప్పుడుబతికిన అ పాప ఇప్పుడు అమ్మాయి.ఇప్పటికీతనకుబతుకుమీద ఆశ లేదని చెప్పడం ఒక విషాదం.  ఇటీవలే తనను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ మరణించడంతోఆ అమ్మాయి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయింది.“అందరినీకోల్పోయిన బతుకూ ఒక బతుకేనా?” అని శాంతి ప్రియ విలపిస్తూ చెప్పింది. నిజమే.ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల్లో ఎంత వేదన నిండుకొనిఉంటుందో, అదిఎట్లా భవిష్యత్తును ఎల్లవేళలాప్రభావితం చేస్తుందో ఆమె జీవితమే ఒక ఉదాహరణ.

సంక్షోభం- స్వయంకృతం

 

శాంతిప్రియ ఉదంతం అలా ఉండగా,ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలనుంచి ఒక నలుగురిని ఎంపికచేసి సిరిసిల్ల ఆత్మహత్యల నివారణకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.మానసిక వికాస కేంద్రంలో పనిచేసే ఆ నలుగురుస్త్రీల వేదన ఒక విషాద ఉదాహరణ. వారుతాము అనుభవించిన క్షోభ మరో కుటుంబం అనుభవించకూడదని ఉద్యోగాన్ని ఒక యజ్ఞంలాచేస్తున్నారు. వారూ అదే అన్నారు.‘చేజారిన తర్వాత ఎంత చేసినా లాభం లేదు.మొదలు తెగిన చెట్టు వంటిదే ఆ జీవితం’ అని! “పరిశ్రమ కింద ఉన్న సామాన్య కార్మికుడిని బతికించడానికి తెలంగాణ వచ్చేదాకా కుదరలేదు, ఎంతసేపు యజమాని కేంద్రంగా ఉపశమన చర్యలు తీసుకున్నారు తప్పాకార్మికుడి గురించి ఆలోచించలేదు” అని వారన్నారు.

గతమంతా అట్లా ఒక స్వయంకృత అపరాధమే.  ఏమైనాతెలంగాణ ఉద్యమ ప్రభావంఅనండీ, ఉద్యమ ఫలితమైన స్వరాష్ట్ర సాధన అనండీ, ఒకనాడు గుడి గంటకు సైతం ఉరి వేసుకున్న సిరిసిల్ల కార్మికుడి కుటుంబం ఇప్పుడు జీవితంలో పడింది.వారికితొలిసారిగాప్రాణాలపై ఆశ కుదిరింది. ఒక్క మాటలో స్మశానంగా మారవలసినసిరిసిల్ల ఇప్పుడు పునర్జన్మపొందిందనే అనాలి.ఇక్కడిమరమగ్గాలన్నిటినీ ఇప్పటికే సుత్తితో కొట్టి,క్వింటాళ్ళకు క్వింటాల్లు ఇనుప సామాను కింద తూకానికి వేయవలసింది. అటువంటిదిఅవే మగ్గాలు ఇప్పుడు ఆడుతున్నాయీ అంటే, అవేసాంచలతోబతుకు బండి మళ్ళీ గాడిన పడిందీ అంటే అదంతా స్వరాష్ట్రఏర్పాటు పుణ్యము,కలిసి వచ్చినకాలమహిమ అని చెప్పక తప్పదు.

అవును.ఇదంతా‘కాలమహిమ’ అని అనడం ఎందుకూ అంటే, సిరిసిల్ల నియోజకవర్గం నుంచిగతంలోశాసన సభకు ఎంపికైన వారెన్నడూప్రభుత్వ పరిపాలనలోభాగస్వామ్యంకాలేదు.మంత్రివర్గంలో చోటు పొందనే లేదు.అటువంటిది,తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ మంత్రి కావడమే కాదు, ఇక్కడి పరిశ్రమకు నేరుగా సహాయం చేయగలిగేలాచేనేతజౌళీ శాఖా మంత్రివర్యులే కావడం సిరిసిల్ల పరిశ్రమకు అందిన వరం అనే అనాలి. దాంతోగత ప్రభుత్వాలు విస్మరించిన‘నిలకడైన ఉపాధి’ కోసం వారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్లకు తెచ్చారు.అత్యంత సాహసోపేతంగాఈ మూడేళ్ళలో వారు ౩౦౦ కోట్ల రూపాయల ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్లకేఅందించారు.బతుకమ్మచీరల తయారీ ఇక్కడికే తెచ్చారు.దాంతో మూడంచెల ఇక్కడి పరిశ్రమ తిరిగిఊపిరి పీల్చుకుంది. మరణశయ్యపై ఉన్న కుటుంబాలలో కొత్త ఆశలు చిగుర్చాయి. దాంతో‘సిరిసిల్ల’నేడు‘ఉరిశాల’ నుంచి ‘శ్రీశాల’ వైపు మరలింది.నమ్మశక్యం కాని నిజం ఇది.

 

ఇక ముందు నిలకడైనఉపాధికి చర్యలు చేపడుతూ,పరిశ్రమనుఆధునీకరించుకుంటూజీవన ప్రమాణాలు పెంచుకోవడం మిగిలింది. క్లుప్తంగా చెప్పినా, ఇదంతా చిన్న విషయం కాదు.ఒకపెద్దముందడుగు.సంస్కరణ నుంచి మార్పు దిశగా పడ్డ తొలి అడుగులు.

 

అసలుకారణాలు
నిజానికిపరిశ్రమ సంక్షోభానికివంద కారణాలు ఉన్నాయి. అవి చెప్పుకుంటే సిగ్గుచేటు.అవును.కానీ, తప్పదు.ముందు ఒక విషయం చెప్పాలి. సుఖమూ, శాంతి అన్నది జీవితపు ఆదర్శం.అంతఆదర్శం అటుంచండి. ఇక్కడినేతకారులవి‘కనీస అవసరాలు తీరని బతుకులు. వాటి నుంచి మొదలైన సంక్షోభం అనేక రకాల పర్యవసనాలుగా వ్యక్తమైందని చెప్పక తప్పదు.
కంటి నిండా నిద్ర, కడుపునిండా భోజనం, దంపతుల మధ్య ఆత్మీయ సాహచర్యం. ఇవి ఏ మనిషికైనాకనీస అవసరాలు.నిజానికి అవి ‘అవసరాలు’ కూడా కాదు,‘సహజాతాలు’.Basic Instincts. ఈ సహజమైన అవసరాలే తీరని జీవితాలు వారివి. అటువంటిది, ఒకటి వెంట ఒకటి మరిన్ని సమస్యలు తోడవగా, అవన్నీ కలిసి వారి జీవితాలను అతలాకుతలం చేశాయి. జీవన శైలిని అదుపు తప్పేలా చేశాయి. ఫలితమేఆకలి చావులు, వరుస ఆత్మహత్యలతోసంక్షోభం.

 

మరమగ్గాల పరిశ్రమ ఒక నరకప్రాయమైనవ్యవస్థ.దడ దడలాడే అ శబ్దం ఎన్నడూ సంగీతం కాదు. అందులో వరుసగా పన్నెండుగంటలు పని చేయడం అమానుషం.అది కూడా ఒక వారం రాత్రి డ్యూటీ...మరో వారం పగటి డ్యూటీ. అంటే, రాత్ పైలీ ...దివస్పైలీ. ఆ డ్యూటీలలో కూడా ఒక్కొక్కరు నాలుగు సాంచాలు చూసుకోవడం పోయి ఆరు, ఎనిమిది, ఇప్పుడుపన్నెండుదాకా వచ్చింది.  అది కూడా అతి తక్కువ వేతనాలతో చేయాలి.పూర్తిగానిలబడే పని చేయాలి.మోకాళ్ళ నొప్పులు సహజం. అట్లా,పన్నెండు గంటలు అవిశ్రాంతంగా పని చేసి ఇంటికి వస్తే, వెంటనే నిద్ర పట్టదు.ప్రతి వారం షిఫ్టులుమారడంతో స్లీప్ సైకిల్ దెబ్బతిని ఉన్న మనుషులకు పడుకుంటే కన్ను అంటుకోదు.దాంతోనెత్తిఫై ఎవరో మోదుతున్నట్టే ఉంటుంది. బుర్రకు,శరీరానికి విశ్రాంతి లభించదు.అందుకు నవనాడులూ సహకరించవు. పొరబాటుగా నిద్ర పట్టినా అది కలత నిద్దుర. దాంతో అనివార్యంగా మత్తుకు బానిస కాకుండా, సొమ్మసిల్లి పడుకోకుండా బతికే పరిస్థితే ఉండదు. అలాగైతే గానీవొంటికి విశ్రాంతి దొరకని స్థితిలో పడ్డాడు కార్మికుడు.

అన్నట్టు,ఇరవై నాలుగు గంటలూ నిరంతరం పని జరిగే కార్ఖానాల్లోఅధ్వాన్నమైన వాతావరణం ఉంటుంది.దుమ్మూ ధూళీపెద్దసమస్య. ముఖ్యంగా ఖబూస్...కాటన్ నుంచి లేచే ధూళి మేఘం.అదిగాలిలోకిచిన్న చిన్న ఉండలుగా లేచి, మెల్లమెల్లగాగుండెల్లోకి దూరి, వూపిరి తిత్తుల్లోకిచేరి దీర్ఘకాలికంగా టీబీకి దారితీయడమూ ఉన్నది.

విషాదం ఏమిటంటే సిరిసిల్లలో సంక్షోభ కాలం పొడవునా తెల్లకల్లులో క్లోరోఫాం ఎక్కువ కలిపేవారు. దానికి తోడు గుడుంబా కూడా అందుబాటులో ఉండేది.తెలంగాణ రాష్ట్రం వచ్చాక గుడుంబాబందుచేయడం, కల్లులో క్లోరోఫాం కలపకుండా చర్యలు తీసుకున్నారు గానీఅంతకుముందు పరిస్థితిదారుణం.ప్రతి కార్మికుడూ నిద్ర కోసం అందుబాటులో ఉన్న కల్లు, గుడుంబామత్తుకు బానిసగా మారి ఆరోగ్యం దెబ్బ తీసుకున్నాడు.

నిద్ర ఇలా ఐతే, కడుపునిండా తిండి తినడంకూడా అసాధ్యం. ఆ అలవాటు కూడా వారికి లేకుండా పోయింది.ఇటు నిద్ర సరిగా లేక, అటు కల్లు తాగిన కడుపు కావడంతో తినడానికి అయిష్టత చూపేవారు.తిన్నా జీర్ణం అయ్యే పరిస్థితి ఉండేది కాదు.దాంతో అన్నంతిన్నామన్నట్లుచెసీ మళ్ళీ డ్యూటీలో పడేవారు.అట్లాఒక ఆగమాగం,ఆకలిరాజ్యం, మత్తు మందు మాటునసిరిసిల్లజీవితంయధేచ్చగా కార్మికుల జీవితాలను బలి తీసుకుంది.దీంతోకార్మికుడు బార్యా పిల్లల విషయంలో తగినంత శ్రద్ధ పెట్టడం అసంభవం అయింది. ఇక, రాత్ పైలీ ...దివస్పైలీలకారణంగాదాంపత్య జీవితానికి ఆధారమైన ఏకాంతం దొరకదు.మనసున్నా శరీరం సహకరించదు. దాంతోఅన్యోన్యత వీగిపోవడం,శారేరక సుఖానికి కూడా దూరంకావడం, జరుగుతూ వచ్చింది.దాంతో అటువృత్తి జీవితం, ఇటు కుటుంబ జీవితం పూర్తిగాయాంత్రికమైంది.

మరమగ్గాల పరిశ్రమ అంటేనే యాంత్రికత.దీనికి తోడు స్వల్ప వేతనాలు. ఏడాది పొడవునా పని లేకపోవడం.ఇవన్నీ కలిసి మొత్తం కార్మిక కుటుంబాల జీవన శైలిని యాంత్రికం చేసింది.ముందే చెప్పినట్టు సహజాతాలు తీరని జీవితాలు. దీనికితోడుఅనారోగ్యంకావోచ్చు, మరోటి కావొచ్చు, ఇతరసమస్యలు కలిసి రావడంతోవారికి జీవితంపై విరక్తిని కలిగించి, ఆత్మహత్యలకు పురికొల్పాయి.

ఎప్పుడో రద్దు కావలసిన పరిశ్రమలు

నిజానికిపురుషుడు ఆధారపడిన మర మగ్గాల పరిశ్రమ అన్ని విధాల కార్మికుడిసహజజీవితాన్ని దెబ్బ తీసేదే. అలాగే సిరిసిల్లలో స్త్రీ ఆధారపడ్డ బీడీ పరిశ్రమా ఆమె ఆరోగ్యాన్ని నిదానంగా పిప్పిపిప్పి చేసేదే. ఈరెండుపరిశ్రమల నుంచి బయట పడవలసిన జీవితాలు అందులోనే కూరుకు పోవడం తీరని విషాదం. చివరకు కమ్యూనిస్టులూ ఈ పరిశ్రమల రద్దు కోసం, ప్రత్యామ్నాయాన్ని కల్పించడం కోసం పోరాడకుండా, ఉన్న వ్యవస్థలోనే సంస్కరణల కోసండిమాండ్ చేస్తూ బతికాయి. దాంతో సిరిసిల్ల ఉరిశాల అయ్యేదాకా ఎవరూ కాపాడలేక పోయారు. అందుకే ఇదంతా స్వయంకృతం అనవలసివస్తుంది.

జీవితానికికనీసంఊపిరి ఇవ్వని వ్యవస్థలు, ఆరోగ్యాన్నిదెబ్బ తీసే పరిశ్రమల నుంచి భద్రమైన ఆరోగ్యమైన జీవితం ఆశించలేం.అదిగ్రహించడం ఒక పెద్ద ముందడుగు. ఆదిశగా పని చేయాల్సిన తరుణం ఎప్పటికైనాఅనివార్యం. సరిగ్గాతెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వంఇవన్నీ అలోచించింది. ఐతే,తక్షణం సిరిసిల్లను బతికించుకోవడం తొలి ప్రాధాన్యం చేసుకుంది.అందుకోసంకోట్లాది రూపాయలతో వరుసగా పని ఇవ్వడం తొలి కర్తవ్యం చేసుకుంది. క్రమేణా మరమగ్గాలను ఆధునీకరించి కార్మికుడికి ఉపశమనం కలిగించడం ద్వితీయ ప్రాధాన్యం చేసుకుంది. అదే సమయంలో బీడీలు చుట్టే మహిళలను దశల వారీగా గార్మెంట్ పరిశ్రమలోకి షిఫ్ట్ చేయడానికి అపెరల్ పార్క్ కోసం నడుం కట్టింది.ఇవన్నీ నేడు సిరిసిల్ల గతిని మరుస్తున్నవి.

ఐతే, ముందే చెప్పినట్టు ఇక్కడ మరనేత పరిశ్రమలో ప్రభుత్వ అజమాయిషీగతంలో ఎన్నడూ లేదు. అసలు సంక్షోభానికి కారణాల్లో ముఖ్య కారణాలు1997 నుంచి దాదాపు2008 దాకా కార్మికుడికి ఎన్నడూ కూడా ఏడాది పొడవునా నిరంతరాయంగా పని లేక పోవడం, గిట్టు బాటు ధర అసలే లేక పోవడం. దీంతోవారంవారం పగారీలు(జీతాలు) తీసుకునే కార్మికుడు ఒక్కోసారి నెలలకు నెలలు ఖాళీగా ఉండవలసి వచ్చింది.సమ్మెల కారణంగా చేతులు ముడుచుకొని కూచోవలసి వచ్చింది.భీమండీ, సూరత్కు వెళ్ళినా అక్కడా ఇదే పరిస్థితి. ఇలా, పని దొరకని స్థితి, తినడానికి తిండి లేని స్థితీ, వీటికితోడు అప్పటికే అనారోగ్యం,ఆందోళన, తాగుడుకి బానిస కావడం,అప్పులు,ఫలితంగాపరిస్థితులపైఏ విధంగా కూడా అదుపులేని స్థితిలోఇంటి యజమాని అచేతనుడిగా మారిపోయాడు. దంపతుల మధ్య కలహ జీవనం సర్వసామాన్యం అయింది.

భర్తల నిస్సహాయ స్థితి ఇలా ఉండగా, బీడీలుచుట్టేభార్యలు, తల్లులుకనీసంపిల్లాజెల్లలనుబతికించుకోవడానికి తమకు అందుబాటులో ఉన్న మైక్రో ఫైనాన్సు, పావలా వడ్డీ రుణాలను ఆశ్రయించడం, ఇంటి అవసరాలకు అనివార్యంగా అప్పులు తేవడం, వాటిని సరైన సమయంలో కట్టలేని స్థితిలోవేరే దిక్కు లేక ఆ మహిళా సదరు ఇంటి యజమానినే నిందించడం అతడిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. దాంతో ఆ మనిషి మరింత ముడుచుకు పోయాడు.

ఇక్కడమరో సమస్యఅతడిని మరింత కృంగ దీసింది.ఉన్నసమస్యలకు తోడు అంతకుముందేభీమండీ, సూరత్వంటి ప్రాంతాలకు వెళ్లి తెలియని అంటువ్యాధులను, ఎయిడ్స్ నూ  వెంట బెట్టుకొని వచ్చిన వారున్నారు. వారిసంగతి భార్యలకు తెలియడం, మాట మాటా అనుకోవడం, కీచులాడుకోవడం, అది పెరిగి దాంపత్య జీవనంలోఒకరిపట్ల ఒకరికిఉన్నవిశ్వాసాన్ని సడలించడం, క్రమేణా అది మరింత నిశ్శబ్ద హింసకు తావివ్వడం, సమస్తజీవితానికి లంకె తెగడం జరిగింది.

ఇక, ఇంతటినరక కూపంలో జీవించాలని ఎవరికి ఉంటుంది?దాంతోప్రాణాలు తీసుకోవడమే శరణ్యంఅన్నట్టు అయింది కొందరికి.ఇలా- అన్ని కారణాలు కలిసి దాదాపు నాలుగు వందల మంది మరణంతో సిరిసిల్ల ‘ఉరిశాల’గా మారింది.

సిరిసిల్లశ్రీశాల వైపు మరలడం

నిజానికిఇక్కడిసాంచలుయాభైఏళ్ల క్రితంవి. వాటితో ఉత్పత్తి అయ్యే వస్త్రం ముతకది.కేస్మెంట్ బట్ట. ఇది పెట్టీకోట్ ల తయారీకి పనికొచ్చేది. ఏ విధంగానూ ఆధునికతకు మారనిపరిశ్రమ. అటువంటిది ఇన్నేళ్ళు దానిపై ఆధారపడటమే తప్పు. అందువల్లే, తమబతుకులకు జీవనాధారమైనమరమగ్గాలను సుత్తితో కొట్టి స్క్రాప్ కింద అమ్మే పరిస్థితి ఇక్కడఒకసారి కాదు, రెండు మూడు సార్లు వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్థమైతుంది. ఐనా, పాలకులు పని కల్పించడం గురించి దృష్టి పెట్టలేదు.మార్పుకుసిద్ధం చేయవలసిన బాధ్యతను చేబూనలేదు. యజమానులు, అసాములూ తమ మానాన తాము బతికారు గానీ ఇదొక పరిశ్రమ అని, ఇందులో అందరిభవితవ్యం ఉందని, మార్పు దిశగా ఆలోచించలేదు. దాంతో సంక్షోభం అన్నది అన్ని విధాల ముప్పొరిగొన్నది.ముందు కింది శ్రేణి కార్మికుడిని అంతం చేసిగానీ వదలలేదు.

నిజానికితెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఉన్నట్లయితే ఇప్పుటికే సిరిసిల్లఒక్కో శ్రేణినీ పీల్చి పిప్పి చేసి స్మశానంగా మార్చేదంటేఅతిశయోక్తి కాదు. అవును మరి. అరవయ్యవదశకం నుంచి మరమగ్గాల పరిశ్రమ సిరిసిల్లలో మొదలైనాఈ మూడేళ్ళుగానే అది నిరంతరాయమైన పనికి కేంద్రంగా మారుతున్నది.ముఖ్యంగా కరంటు సమస్య తీరిపోవడం కలిసి వచ్చింది. అలాగే,పురాతనమరమగ్గాల నుంచి మెలమెల్లగాఆధునికతను సంతరించుకోవడం మొదలయింది.యజమాని, ఆసామి, కార్మికుడు- ఈ ముగ్గురూ నిలదొక్కుకోవడానికి తగిన చర్యలు నిలకడగా ప్రారంభమయ్యాయి.ఇదంతాచిన్న విషయం కాదు. మంత్రి కేటీఆర్ ఇవ్వాళఆ పట్టణానికి దేవుడే అయ్యాడంటే అందుకు కారణం పరిశ్రమ బతికి బట్ట కట్టే చర్యలు సాహసోపేతంగా తీసుకోవడమే.

ఐతే,పరిశ్రమసంక్షోభానికి కారణమైనఅన్ని విషయాలు ఇప్పటికైనా లోతుగాచర్చించుకోవడం అత్యవసరం.పౌర సమాజం కూడానిర్లిప్తత వీడాలి. లేకపోతేసిరిసిల్లశ్రీశాలగా మారే దశ, దిశా, ఆ వైపుగా సాగే పునర్నిర్మాణం అంత తేలిక కాదు.ఇదిఒక్క ప్రభుత్వం మాత్రమే చేసే పనికూడాకానే కాదు.

     -కందుకూరి రమేష్ బాబు (సీనియర్ జర్నలిస్ట్)                                                                                                           వ్యాస రచయిత వస్త్ర పరిశ్రమపై అధ్యయనం చేస్తున్నారు.

 

 

 

 

 

 

click me!